Pokiri: 19 ఏళ్ళ ‘పోకిరి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు..!

‘ప్రిన్స్’ మహేష్ బాబుని (Mahesh Babu) సూపర్ స్టార్ మహేష్ బాబుగా చేసిన సినిమా ‘పోకిరి’ (Pokiri). అప్పటివరకు మహేష్ బాబుకి స్టార్ ఇమేజ్ ఉంది కానీ మార్నింగ్ షోలు హౌస్ఫుల్ బోర్డులు పడేంత కాదు. ఒక రకంగా మహేష్ బాబు కెరీర్ గురించి చెప్పాలి అంటే ‘పోకిరి’ కి ముందు.. ‘పోకిరి’ తర్వాత అనే చెప్పాలి. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘వైష్ణో అకాడమీ’ ‘ఇందిరా ప్రొడక్షన్స్’ సంస్థలపై పూరీ జగన్నాథ్, మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni) కలిసి నిర్మించారు. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 19 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ క్రమంలో ‘పోకిరి’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :

Pokiri

1) వాస్తవానికి ‘పోకిరి’ సినిమాని ముందుగా పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) చేయాలని పూరి అనుకున్నారు. కానీ పవన్ కు అప్పట్లో ‘పోకిరి’ చేసే మూడ్ లేదు.

2) దీంతో పూరి… రవితేజని (Ravi Teja) అప్రోచ్ అయ్యాడు. అతనికి ఈ సినిమా కథ నచ్చింది. ఆ టైంకి నాగబాబు (Nagendra Babu) నిర్మాణంలో, పూరీ నిర్మాణ భాగస్వామిగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ‘ఉత్తమ్ సింగ్’ టైటిల్ తో 2 రోజులు షూటింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కూడా ఆగిపోయింది.

3) ఆ తర్వాత పూరి ‘సూపర్’ చేశాడు. అది యావరేజ్ గా ఆడింది. పూరి హవా ఆ టైంలో కొంచెం తగ్గింది. దీంతో స్టార్ హీరోలు అతనికి ఛాన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. రవితేజతో సహా. ఈ క్రమంలో ‘సూపర్’ లో సెకండ్ హీరో టైపు రోల్ చేసిన సోనూ సూద్ ని (Sonu Sood) హీరోగా పెట్టి ‘ఉత్తమ్ సింగ్’ చేయాలి అనుకున్నాడు పూరీ. కానీ ఆ టైంలో సోనూ సూద్ కు వరుస సినిమాల్లో అవకాశాలు రావడంతో అతను ‘చేయలేను’ అని చెప్పి తప్పుకున్నాడు.

4) అప్పుడు దాదాపు ఈ కథని పక్కన పెట్టేయాలని పూరి డిసైడ్ అయ్యాడు. అలాంటి టైంలో త్రివిక్రమ్ (Trivikram) సజిషన్ తో.. చివరి ప్రయత్నంగా మహేష్ కి చెప్పి చూడాలని భావించాడు. ‘అతడు’ తో (Athadu) హిట్ కొట్టాక.. వెంటనే ‘సైనికుడు’ (Sainikudu) సినిమా మొదలుపెట్టాడు మహేష్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది. దీంతో మహేష్ కు కొంత గ్యాప్ దొరికింది.

5) అదే టైంలో పూరి జగన్నాథ్ వెళ్లి మహేష్ కి కథ వినిపించాడు. ‘ఉత్తమ్ సింగ్’ అనే టైటిల్ కలిసి రాలేదు అని భావించి పూరి… ‘పోకిరి’ అనే టైటిల్ తో ఈ కథని మహేష్ కి వినిపించాడు. పూరీ నెరేషన్ కు మహేష్ ఇంప్రెస్ అయిపోయాడు. ఈ సినిమా కోసం మహేష్ 45 రోజులు కాల్షీట్లు ఇచ్చాడు. ఇక పూరీ స్పీడ్ తెలిసిందే కథా. మహేష్ ఓకే చేసిన వారానికే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయాడు.

6) హీరోయిన్ గా మొదట కంగనా రనౌత్ ను (Kangana Ranaut) అనుకున్నాడు పూరీ. కానీ ఆమె ఆ టైంకి తెలుగులో సినిమా చేయడానికి రెడీగా లేదు. తర్వాత ‘సూపర్’ (Super) హీరోయిన్ అయేషా టాకియాని (Ayesha Takia) కూడా అనుకున్నాడు. ఆమె కూడా ఎందుకో సెట్ అవ్వలేదు. అటు తర్వాత ‘వెన్నెల’ (Vennela)  తో పాపులర్ అయిన పార్వతీ మిల్టన్ ను (Parvati Melton) సంప్రదించారు. ఆమె కూడా సెట్ అవ్వలేదు. ఫైనల్ గా ‘దేవదాసు’ (Devadasu) హీరోయిన్ ఇలియానాని (Ileana D’Cruz) ఎంపిక చేసుకున్నారు. లుక్ టెస్ట్ లో కూడా ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

7) ఇక ఈ సినిమా షియాజీ షిండే (Sayaji Shinde) పాత్ర కోసం ముందుగా అమితాబ్ బచ్చన్ ను (Amitabh Bachchan) సంప్రదించాడు పూరీ. కానీ అమితాబ్ కొన్ని మార్పులు కోరడంతో ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదు అని భావించి షియాజీ షిండేని ఫైనల్ చేశారు. అతని పాత్ర కూడా సినిమాలో బాగా హైలెట్ అయ్యింది.

8) ‘పోకిరి’ చిత్రాన్ని కేవలం 66 రోజుల్లో ఫినిష్ చేశాడు పూరీ. చాలా వరకు సింగిల్ టేకులే. ఒకే సెట్లో.. ఒకే టైంలో 2,3 సీన్లు కూడా తీశారు. పూరీ లేకుండా సీన్లకి మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వ పర్యవేక్షణ చేయడం జరిగింది.

9) 2006 ఏప్రిల్ 28న ‘పోకిరి’ రిలీజ్ అయ్యింది. విడుదలకి ముందు ఈ సినిమాపై ఎటువంటి హైప్ లేదు. ఎక్కడా కూడా ఎర్లీ మార్నింగ్ షోలు కూడా పడలేదు. కానీ మొదటి వారం స్లోగానే స్టార్ట్ అయ్యింది. కలెక్షన్స్ కూడా మొదటి వారం సోసో గానే వచ్చాయి. కానీ 2వ వారం పవన్ కళ్యాణ్ ‘బంగారం’ (Bangaram) వచ్చింది. అందువల్ల సెకండ్ వీకెండ్ కూడా ఓ మోస్తరు కలెక్షన్సే నమోదయ్యాయి. కానీ ఆ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ‘పోకిరి’ హవా ఊపందుకుంది. సినిమా 10వ రోజు నుండి 175 వ రోజు వరకు.. ‘పోకిరి’ ఎక్కడా తగ్గలేదు.

10) 299 కేంద్రాల్లో 50 రోజులు, 200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన ఘనత ‘పోకిరి’ సొంతం. ఇక ఫుల్ రన్లో ఈ సినిమా రూ.39 కోట్ల షేర్ ను, రూ.66 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది.

శ్రీవిష్ణు మార్క్ కామెడీతో..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus