మనీషా ఫిలింస్ బ్యానర్, కిషోర్ రాఠీ సమర్పణలో, అచ్చిరెడ్డి నిర్మాత, ఎస్.వి. కృష్ణా రెడ్డి దర్శకత్వం.. పైగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హీరో అంటే అదో క్రేజీ కాంబినేషన్ అప్పట్లో.. కామెడీ, ఫ్యామిలీ అంశాలతో ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగుండేది. అందులోనూ కృష్ణా రెడ్డి సంగీతమందించే పాటలు అయితే సూపర్ హిట్ అయ్యేవి.రాజేంద్ర ప్రసాద్ ‘కొబ్బరి బొండాం’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంగీత దర్శకుడు మరియు నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన కృష్ణా రెడ్డి ఆ తర్వాత ఏనుగుని ప్రధాన పాత్రలో పెట్టి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ తీశారు.
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య హీరో హీరోయిన్లు కాగా.. కోట శ్రీనివాస రావు, గుమ్మడి, బ్రహ్మానందం, బాబూ మోహన్, అలీ, గుండు హనుమంత రావు, శ్రీలక్ష్మీ, జయ లలిత తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 1993 ఫిబ్రవరి 4న రిలీజ్ అయిన ఈ సినిమా 2023 ఫిబ్రవరి 4 నాటికి 30 సంవత్సారాలు పూర్తి చేసుకుంటోంది. లిమిటెడ్ బడ్జెట్‌లో కథ, కథనాలకు పెద్ద పీట వేస్తూ.. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే విధంగా..
హాస్యం, భావోద్వేగాలు వంటి అంశాలతో రూపొందించిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ మూవీకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ‘రాజేంద్రుడు’ పాత్రలో ఏనుగు చేసే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక కృష్ణా రెడ్డి కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అలరించాయి. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య పెయిర్ చక్కగా కుదిరింది. ఇక హాస్యనటుల కామెడీ అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది.
దివాకర్ బాబు చక్కటి డైలాగ్స్ రాశారు. శరత్ సినిమాటోగ్రఫీ, రామ్ గోపాల్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. భారీ స్థాయిలో విడుదల చేయగా.. దాదాపు అన్ని సెంటర్లలో 100 రోజుల పాటు ప్రదర్శితమై, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచి పెట్టింది. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, సౌందర్యలతో ‘మాయలోడు’ అనే మరో సూపర్ హిట్ తీశారు కృష్ణా రెడ్డి.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!