Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘బాహుబలి’ కి ముందు ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘రెబల్’ ‘మిర్చి’ వంటి సినిమాలు చేశాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన మూవీ ఇది. లారెన్స్ కి దర్శకుడిగా కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలతో ప్రభాస్ సక్సెస్లలో ఉన్నాడు. సో ‘రెబల్’ అనేది మినిమమ్ గ్యారంటీ ప్రాజెక్టు అని అంతా భావించారు. కానీ కట్ చేస్తే.. 2012 సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద ప్లాప్ గా నిలిచింది.

Rebel Movie

మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్న ‘రెబల్’.. ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసింది అని చెప్పాలి. ఒకటి రెండు ఎలివేషన్ సీన్స్ కి తప్ప.. ప్రభాస్ (Prabhas) ఇమేజ్ ను లారెన్స్ సరిగ్గా వాడుకోలేదు అని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద 80 శాతం పైనే రికవరీ సాధించింది. కానీ నిర్మాతలు ఈ సినిమాకి బడ్జెట్ హెవీగా పెట్టేశారు. దాని వల్ల వాళ్లకు నష్టాలు వచ్చాయి.

‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు ఎవరంటే.. ముందుగా బండ్ల గణేష్. ముందుగా ‘రెబల్’ (Rebel) ని నిర్మించే అవకాశం అతనికే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అతను తప్పుకున్నాడు. తర్వాత ‘శ్రీ బాలాజీ సినీ మీడియా’ అధినేతలు అయిన జె.భగవాన్,జె.పుల్లారావు..లు ‘రెబల్’ ను నిర్మించారు. అటు తర్వాత అనుష్కని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ లారెన్స్ తో గొడవ కారణంగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది.

దీంతో తమన్నాని ఎంపిక చేసుకున్నారు. ఇక సంగీత దర్శకుడిగా మొదట తమన్ ను తీసుకున్నారు. కానీ తర్వాత అతన్ని తప్పించి లారెన్స్ మ్యూజిక్ చేయడం జరిగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చిన్నాతో కొట్టించారు. ఇలా అనుష్క, బండ్ల గణేష్, తమన్..లు ‘రెబల్’ (Rebel) వంటి డిజాస్టర్ నుండి తప్పించుకున్నారు అని చెప్పాలి.

ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus