‘పలనాటి బ్రహ్మనాయుడు’ అనే చిత్రంతో బాలకృష్ణ ఇమేజ్ డ్యామేజ్ చేసాడు అని ఆయన అభిమానులు దర్శకుడు బి.గోపాల్ ను తిట్టుకుంటారు కానీ.. బాలయ్యకు గతంలో ఇండస్ట్రీ హిట్ లు, బ్లాక్ బస్టర్ లు చాలా ఇచ్చారు బి.గోపాల్.సరిగ్గా 29 ఏళ్ళ క్రితం విడుదలైన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ మూవీ కూడా అందులో ఒకటి. ‘విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్’ పతాకం పై టి.త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం 1992 మే 7న విడుదలయ్యింది. మొదటి షోతోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ చిత్రం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్ టైములో దర్శకుడు బి.గోపాల్ కు ఓ కండిషన్ పెట్టాడట బాలయ్య. దానికి నొ చెబితే షూటింగ్ కు రాను అని హెచ్చరించాడట. పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ షూటింగ్ మొదలయ్యే ముందు బాలకృష్ణ.. ఈ సినిమాలో తాను చెయ్యబోయే రామరాజు అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేసాడట. పోలీసులు ఎలా నడుస్తారు.. జీపులో ఎలా కూర్చుంటారు..
లాఠీ చేత్తో ఎలా పట్టుకుంటారు అనే విషయాల పై పూర్తి అవగాహన తెచ్చుకున్నాడట. అంతేకాకుండా ఓ రోజు బాలయ్య దర్శకుడికి ఫోన్ చేసి ‘నేను షూటింగ్ కు రావాలంటే.. పోలీస్ జీపు పంపించాలి. అందులోనే వస్తాను లేదంటే రాను’ అంటూ కండిషన్ పెట్టాడట. ఏసీ కార్లో షూటింగ్ కు వచ్చే బాలయ్య.. పోలీస్ జీపులో వస్తాననడంతో దర్శకుడు బి.గోపాల్ ఆశ్చర్యపోయారట. ‘బాలయ్యకు సినిమా పై ఉన్న ప్యాషన్ అలాంటిది’..అంటూ బి.గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
1
2
3
4
5
6
7
8
9
10
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!