విశ్వవిఖ్యాత, నటరత్న నందమూరి తారక రామారావు చేసిన సినిమాలు, ప్రయోగాలు, మెప్పించిన పాత్రల గురించి, తన అసమాన నటనతో ఆ పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే.. పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రాత్మకం.. రాముడు, కృష్ణుడు, భీముడు, ధుర్యోధనుడు, యముడు, బృహన్నల.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా, రెండా.. ఎన్నో అద్భుతమైన పాత్రలు కళ్లముందు కదలాడుతాయి.. వాటిలో అపురూపమైన పౌరాణిక చిత్రం ‘సతీ సావిత్రి’ కూడా ఒకటి..
ఎన్టీఆర్, వాణిశ్రీ, కృష్ణంరాజు, గుమ్మడి, కాంతారావు, మిక్కిలినేని, ధూళిపాళ్ల, జమున, అంజలి దేవి వంటి తదితర భారీ తారగణంతో.. బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో.. లలిత శివజ్యోతి స్టూడియోస్ బ్యానర్ మీద ఎ.శంకర్ రెడ్డి నిర్మించగా ఆబాలగోపాలాన్ని అలరించిన పౌరాణిక చిత్రం ‘సతీ సావిత్రి’ 1978 జనవరి 4న విడుదలైన సంచలన విజయాన్ని సాధించింది.. ఈ సినిమా 2023 జనవరి 4తో 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
కథగా చెప్పాలంటే.. మహా పతివ్రత అయిన సతీ సావిత్రి జీవితం జగద్విదితం.. ఆమె జీవిత కథకే కొన్ని భారీ హంగులు చేర్చి అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. అశ్వపతి మహారాజు ఏకైక పుత్రిక సావిత్రి.. ద్యూమత్సేన మహారాజు కొడుకు సత్యవంతుని వివాహం చేసుకుంటుంది. రాజ్యభ్రష్టులైన సత్యవంతుని కుటుంబంతో పాటే భర్త జీవితంగా సావిత్రి కూడా బతుకుంటుంది. కట్టెలు కొడుతూ జీవించే సత్యవంతుడు జాతకం ప్రకారం అల్పాయుష్కుడు.. కట్టెలు కొడుతుండగా పాము కాటేస్తుంది.. మరణించిన సత్యవంతుని ప్రాణాలను కొనిపోతున్న మయధర్మరాజుని అడ్డగించి..
తన పాతివ్రత్యంతో అతనితో చాకచక్యంగా మాట్లాడి పతి ప్రాణాలను సంపాదించుకుంటుంది.. ఆమె తెలివి తేటలకు మెచ్చి యమధర్మరాజు ఆ దంపతులను ఆశీర్వదించి.. వారికి రాజ్యముతో పాటు భోగభాగ్యాలను ప్రసాదించడంతో కథ సుఖాంతమవుతోంది.. యముడిగా నటరత్న నటనా చాతుర్యం అమోఘం.. సావిత్రిగా వాణిశ్రీ ఆయనకు ధీటైన నటనను ప్రదర్శించారు. ఆమె భర్త సత్యవంతునిగా కృష్ణంరాజు నటించారు.
మిగతా పాత్రలన్నీ తమ నటనతో మెప్పిస్తాయి.. ఆచార్య ఆత్రేయ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. మొదటి రెండు పాటలను రూపొందించిన తర్వాత ఘంటసాల మరణించడంతో పెండ్యాల మిగతా పాటలను పూర్తి చేశారు. నేరుగా మరియు షిఫ్టుల వారీగా 100 రోజులు ఆపైగా ప్రదర్శితమవడమే కాక 1981లో హిందీలో డబ్ చేయడం విశేషం..
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?