Simhasanam: 37 ఏళ్ళ సూపర్ స్టార్ కృష్ణ ‘సింహాసనం’ గురించి ఆసక్తికర విషయాలు

  • March 23, 2023 / 11:43 AM IST

‘ధైర్యే సాహసే లక్ష్మీ’ అని పెద్దలు చెబుతుంటారు. దీనికి నిలువెత్తు రూపమే సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే మనం గతంలోకి వెళ్లి ‘సింహాసనం’ సినిమా గురించి తెలుసుకోవాలి. నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ముగించి రాజకీయాల్లో రాణిస్తున్న రోజులవి. ఏఎన్నార్, శోభన్ బాబు.. కుటుంబ కథా చిత్రాలు ప్రేమ కథలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. మరోపక్క ‘ఖైదీ’ తర్వాత చిరంజీవి రేంజ్ అమాంతం పెరిగింది. పెద్ద నిర్మాతలు, దర్శకులు అందరూ చిరంజీవి కాల్ షీట్ల కోసం ఎదురుచూసేవారే. ఆ టైంలో సీనియర్ హీరోల వంక ఇండస్ట్రీ పెద్దలు చూడటమే తగ్గించేశారు.ఆ టైంలో కృష్ణ చేసిన ‘బ్రహ్మాస్త్రం’ ‘కృష్ణ గారడి’ ‘మహా మనిషి’ సినిమాలు పెద్దగా ఆడలేదు. డాన్స్ ల పరంగా కృష్ణ వీక్. సో ఆ టైంలో చిరంజీవిని మించి కృష్ణ ఏం చేయగలరు అనే ప్రశ్న అభిమానుల్లో ఉంది.

అదే టైంలో ఆయనకు ఓ ఐడియా వచ్చింది. ఆయన మదిలో మెదిలిన చిన్న ఆలోచనను తన ఆస్థాన రచయిత అయిన త్రిపురనేని మహారథికి చెప్పారు. ఆయన కొన్ని రోజులు కిందా మీదా పడితే మంచి కథయ్యింది. ఆ కథను సాదా సీదాగా తీసేయొచ్చు. అలా చేస్తే.. కృష్ణ ఎందుకవుతారు. అందుకే…అత్యాధునిక సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని బైలింగ్యువల్ మూవీగా చేయాలని డిసైడ్ అయ్యారు. స్వయంగా కృష్ణ గారే ఈ చిత్రంలో నటించి, నిర్మించి డైరెక్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ఈ సినిమా కోసం ‘పద్మాలయ’ స్టూడియోస్ లో రూ.0.50 కోట్లతో సెట్ వేశారు. ఆ డబ్బుతో ఆ టైంలో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు పూర్తిచేసేశావారు.

2) కృష్ణ దూకుడు చూసి ఫైనాన్స్ చేయడానికి కూడా కొన్ని సంస్థలు భయపడ్డాయి. ఈ సినిమా కోసం ఆయన తన ఇంటిని కూడా తాకట్టు పెట్టారు.

3) ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు కృష్ణకు ఇలాంటి ప్రయోగాలు వద్దని నచ్చజెప్పారు. కానీ కృష్ణ తగ్గలేదు. ‘ఈ సినిమా చేసే టైంలో నువ్వు 3,4 సినిమాలు చేసేస్తావు’ అని కూడా కృష్ణకి చెప్పినా లెక్క చేయలేదట.

4) ‘సింహాసనం’ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు ఓ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ లభించింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా పని చెయ్యాలి. అందుకోసమే యూనిట్ సభ్యులందరికీ రుచికరమైన నాన్ వెజ్ భోజనాలు ఏర్పాటు చేసేవారు కృష్ణ.

5) పద్మాలయ స్టూడియోస్ లో వేసిన సెట్ చూడటానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వారి కుటుంబాలతో కలిసి చూడటానికి వచ్చేవారట.

6)బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరిని టాలీవుడ్ కు పట్టుకొచ్చారు కృష్ణ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటలు పాడించారు. అప్పటి బాలీవుడ్ బ్యూటీ మందాకినిని కూడా ఈ చిత్రం కోసం తీసుకొచ్చారు.

7) ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క.. ప్రమోషన్ల కోసం మ్యాగ్ జైన్ల వారితో ప్రెస్ మీట్లు పెట్టేవారు కృష్ణ. మొదటి రెండు షెడ్యూల్స్ అవ్వగానే హిందీలో కూడా ఈ చిత్రాన్ని రూపొందించాలని జితేంద్రని సంప్రదించడం ఆయన ఓకే చెప్పడం జరిగింది.

8) కొంచెం అటు ఇటుగా ‘సింహాసనం’ ప్రాజెక్టు పూర్తయింది. రెండు వెర్షన్లు కలుపుకుని రూ.2.5 కోట్ల బడ్జెట్ అయ్యింది. బిజినెస్ అనుకున్నదానికంటే బాగా జరిగింది. 1986 మార్చ్ 21న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అంతకంటే ఓ వారం ముందుగానే హిందీ వెర్షన్ రిలీజ్ అయ్యింది. అక్కడ సినిమా బాగానే ఆడింది. ఇక తెలుగులో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

9) మొదటి వారం ఈ సినిమా ఏకంగా రూ.1.5 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఫుల్ రన్లో ఏకంగా రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

10) 41 కేంద్రాల్లో ఈ సినిమా డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. ఈ సినిమా కోసమే తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లను రిపేర్ చేయించుకున్నాయి థియేటర్ యాజమాన్యాలు. సినిమా సూపర్ సక్సెస్ అయ్యాక.. యూనిట్ సభ్యులకు కృష్ణ బహుమతులు ఇచ్చి సత్కరించారు. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 37 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus