Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » 60 సంవత్సరాల ‘శ్రీకృష్ణార్జునయుద్ధము’ గురించి ఆసక్తికర విషయాలు..!

60 సంవత్సరాల ‘శ్రీకృష్ణార్జునయుద్ధము’ గురించి ఆసక్తికర విషయాలు..!

  • January 9, 2023 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

60 సంవత్సరాల ‘శ్రీకృష్ణార్జునయుద్ధము’ గురించి ఆసక్తికర విషయాలు..!

నటరత్న ఎన్టీఆర్, నటసామ్రాట్ ఏఎన్నార్.. ఇద్దరూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి రెండు కళ్లు లాంటి వారు.. అలాంటి మహానటులిద్దరూ కలిసి నటిస్తే.. ప్రేక్షకాభిమానులకు రెండు కళ్లు చాలవు.. వీరిద్దరూ కలిసి పలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు.. ఎన్టీఆర్ పౌరాణిక, జానపదాల్లో ఊపు ఊపుతుండగా.. అక్కినేని సాంఘికాల్లో రాణిస్తున్న టైం అది.. అప్పుడు కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘శ్రీకృష్ణార్జునయుద్ధము’ చిత్రంలో కలిసి నటించారు.. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, ఏఎన్నార్ అర్జునుడిగా నటించి ఆబాలగోపాలాన్నీ అలరించారు..

సుభద్రగా బి.సరోజా దేవి, రుక్మిణిగా జూనియర్ శ్రీరంజని, సత్యభామగా ఎస్.వరలక్ష్మీ, నారదుడిగా కాంతారావు, బలరాముడిగా మిక్కిలినేని, గయునిగా ధూళిపాల, ధర్మరాజుగా గుమ్మడి నటించగా.. అల్లు రామలింగయ్య, మహంకాళి వెంకయ్య, నాగయ్య, ముక్కామల, సత్యనారాయణ, ప్రభాకర రెడి, చదలవాడ, బుష్యేంద్రమణి, ఛాయాదేవి, సురభి బాల సరస్వతి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు..

దర్శక నిర్మాతగా కె.వి.రెడ్డి సాహసం..

జయంతి పిక్చరు బ్యానర్ మీద కె.వి. రెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరించారు.. పింగళి మాటలు, పాటలు రాశారు.. స్వాములవారి వేషంలో ద్వారకకు వచ్చిన అర్జునుడికి.. అర్జునుడి దశ నామాలలో మొదటి అక్షరాలన్నిటినీ కలిపి ‘అజిబీధపఫావిశ్వేసకి’ అని పేరు పెట్టారంటేనే పింగళి వారి రచనా చాతుర్యం దానిలోని చమత్కారం అర్థం చేసుకోవచ్చు.. పెండ్యాల నాగేశ్వర రావు సంగీతమందించారు.. ఈ చిత్రానికి కమల్ ఘోష్ సినిమాటోగ్రాఫర్ కానీ ట్రిక్స్‌ను రవికాంత్ నగాయిచ్ సమకూర్చారు..

ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఇద్దరిలో ఎవరి పేరు ముందు వెయ్యాలో తెలియక కె.వి.రెడ్డి ఏం చేశారంటే..

సినిమాలోని అన్ని పాటలూ, పద్యాలు ప్రేక్షకాదరణ పొందాయి.. ఇప్పటికీ వినిపిస్తుంటాయి కూడా.. ‘గయోపాఖ్యానం’ లోని పద్యాలను, ‘పారిజాతాపహరణం’ లోని పద్యాన్ని అవసరమైన చోట వాడడం జరిగింది.. ఇక టైటిల్స్ విషయానికొస్తే.. ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఇద్దరిలో ఎవరి పేరు ముందు వేయాలో అర్థంకాక.. తారాగణం అని పడగానే.. శ్రీకృష్ణుడు, అర్జునుడు, సుభద్రల పాత్రలను చూపించి.. తర్వాత ఇతర నటీనటుల పేర్లు వేశారు.. లెెజెండరీ డైరెక్టర్‌గా పేరొందిన సింగీతం శ్రీనివాసరావు సహాయ దర్శకుడిగా పని చేశారు.. 13 కేంద్రాలలో శత దినోత్సవం, షిఫ్టుల వారీగా మరో రెండు కేంద్రాలు.. మొత్తం మీద 15 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది..

ఎన్టీఆర్ నటనదే పైచేయి..

తెరమీద శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూడగానే జనాలు హారతులిచ్చి, టెంకాయలు కొట్టేవారు.. ఎలా చూసుకున్నా సినిమాలో తారక రాముని నటనే పైచేయిగా సాగింది.. అందుకే సినిమా చూసిన తర్వాత ఏఎన్నార్ భార్య అన్నపూర్ణ.. ‘ఇక మీదట పౌరాణికాల్లో ఎన్టీఆర్ గారితో కలిసి నటించకండి’ అని చెప్పారట.. కారణాలేవైనా కానీ తర్వాత 14 సంవత్సరాల పాటు వీరిద్దరూ కలిసి నటించలేదు.. 1977లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘చాణక్య చంద్రగుప్త’ లో కలిసి నటించారు.. 1963 సంవత్సరం నటరత్నకు బాగా కలిసొచ్చింది.. ఆ ఏడాది విడుదలైన ‘లవకుశ’, ‘నర్తనశాల’ ‘బందిపోటు’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageswara Rao
  • #K.V Reddy
  • #N.T.Rama Rao
  • #Sri Krishnarjuna Yuddhamu

Also Read

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

related news

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

trending news

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

58 seconds ago
Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

20 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

20 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

20 hours ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

21 hours ago

latest news

GAMA Awards: ‘గామా అవార్డ్స్’ ఈసారి మరింతగా స్పెషల్..!

GAMA Awards: ‘గామా అవార్డ్స్’ ఈసారి మరింతగా స్పెషల్..!

40 mins ago
రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

16 hours ago
Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

20 hours ago
War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

2 days ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version