14 ఏళ్ళ వయసులోనే తెరంగేట్రం ..70కి పైగా హిట్ సినిమాలు.. కానీ చివరకు 36 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు.!

15 ఏళ్లకే బ్లాక్ బస్టర్ హీరోయిన్ .. చిన్న వయసులోనే తన అందం, అభినయంతో వరుస అవకాశాలతో మంచి పేరు తెచ్చుకుంది… అప్పట్లో కుర్రాళ్ళ మనసుల్లో ఆరాధ్య దేవత అయిన ఆమె …సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయి వరకు వెళ్ళింది… కానీ 36 ఏళ్లకే విధి ఆడిన వింత నాటకంలో తన చివరి శ్వాసను వదిలింది.

బాలీవుడ్‌లో చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్లు అవుతున్న రోజులవి. అలాంటి రోజుల్లో, గుండె సమస్యతో పుట్టినా తన అందం, నటనతో మొత్తం ఇండస్ట్రీని మంత్ర ముగ్దులను చేసిన ఓ తార మధుబాల. 1950–60లలో యూత్‌కి డ్రీమ్ గర్ల్‌గా ఒక వెలుగు వెలిగిన ఆమె, 70కి పైగా హిట్ చిత్రాలలో నటించి మ్యాజిక్ సృష్టించింది. ఆమె చిరునవ్వు, స్క్రీన్‌పై నేటికీ అభిమానుల హృదయాల్లో మరువలేని ఓ అనుభూతి. నర్గీస్, మీనా కుమారి లాంటి లెజెండ్స్ సరసన నిలిచిన మధుబాల, భారతీయ సినీ చరిత్రలో తన అందం, అపారమైన ప్రతిభ చిరస్థాయిలో నిలిచింది.

Madhubala

మధుబాల 1933 ఫిబ్రవరి 13న ఢిల్లీలో జన్మించారు. తన 8 సంవత్సరాల వయస్సులో తన కుటుంబం బొంబాయి (ప్రస్తుతం ముంబై)కి రావటం జరిగింది. ఆమె తండ్రి ఉద్యోగం కోల్పోవాదం, తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది మధుబాల. మధుబాల 1942లో 9 సంవత్సరాల వయసులో బసంతిల్ చిత్రంలో నటించింది.బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె తన నటనతో డైరెక్టర్ల మన్ననలు పొందింది. ఆ తరువాత వరుసగా నీల్ కమల్ (1947), అమర్ (1954), భయానక చిత్రం మహల్ (1949), రొమాంటిక్ చిత్రాలైన బాదల్ (1951), తరానా (1951)తో విజయాన్ని సాధించింది.

1960లో మధుబాల నటించిన అనార్కలి పాత్ర, ఆ సమయంలో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసించారు. ఆ పాత్రకుగాను మధుబాల ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది.

అయితే పుట్టుకతోనే గుండె జబ్బు (వెంట్రిక్యులర్ సెప్టల్ లోపం)తో జన్మించినప్పటికీ, ఆమె తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంది. చెన్నైలో ఒక హిందీ సినిమా షూటింగ్ సమయంలో ఆమె రక్తం వాంతి చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడే ఆమె నయం చేయలేని తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు సినీ ప్రపంచానికి తెలిసింది. గుండె జబ్బు తనను వెంటాడుతున్నా, కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడే, ఆమె ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దురదృష్టవశాత్తూ, అనారోగ్యం కారణంగా ఆ అందాల తార 1969లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus