సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దానికి పోటీగా మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తూ వుంటాయి. కానీ , వాటిలో ఒక్కటి హిట్‌గా నిలిచి, మిగిలినవి వచ్చినట్లు కూడా తెలియకుండా థియేటర్ల నుంచి మాయమవుతూ వుంటాయి. అయితే అగ్ర కథానాయకుల సినిమాలు వచ్చినప్పుడు మాత్రం పోటీ తీవ్రంగా వుంటుంది. అలాంటప్పుడు కూడా ఒకటి రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకాదరణకు నోచుకుంటూ వుంటాయి. ఇలాంటి ఉదంతాలు తెలుగు చిత్ర సీమలో ఎన్నో వుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ‘రాజా’ సినిమా అప్పుడు జరిగింది.
ముప్పలనేని శివ దర్శకత్వంలో విక్టర్ వెంకటేష్- సౌందర్య నటించిన ‘రాజా’ 1999 మార్చి 18న విడుదలై రజతోత్సవం జరుపుకుంది. నటీనటుల ప్రతిభ, సౌందర్య గ్లామర్, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఈ సినిమాను విజయపథంలో నడిపించాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా తొలి వారం కోటి 89 లక్షల షేర్‌ని కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. అయితే రాజా చిత్రం విడుదల సమయంలోనే పలు సినిమాలు పోటీగా వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ జంటగా రేలంగి నరసింహారావు డైరెక్షన్‌లో వచ్చిన చిన్నిచిన్ని ఆశ.. సురేష్ వర్మ డైరెక్షన్‌లో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన ఇంగ్లీష్ పెళ్లాం, ఈస్ట్ గోదావరి మొగుడు…
తులసి కుమార్ డైరెక్షన్‌లో జెడి చక్రవర్తి, రాశి జంటగా నటించిన హరిశ్చంద్ర.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన చిత్రం యమజాతకుడు రోజుల గ్యాప్‌లో రిలీజైనా ఆశించిన మేర ఆడలేదు. కానీ ఒక్క సినిమా మాత్రం రాజా ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడింది. అదే కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ ప్రేమ హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రంతోనే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అద్భుతమైన గ్రాఫిక్స్, సంగీతం, సాంకేతిక విలువలతో నిర్మించిన దేవీ మంచి వసూళ్లు రాబట్టింది.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు