Divya Bharti: జూనియర్ శ్రీదేవి అవుతుందనుకున్న దివ్య భారతి మృతి వెనుక ఎన్నో అనుమానాలు..!

దివ్యా ఓంప్ర‌కాశ్ భార‌తి.. ఎవరబ్బా అనే డౌట్ మీకు రావొచ్చు, అదే దివ్య భారతి అంటే చాలు చక్కని చిరునవ్వుతో చందమామ లాంటి అందంతో ఓ తార మన కళ్ళ ముందు తళుక్కున మెదులుతుంది. అతిలోక సుందరి శ్రీదేవి తర్వాత అంతటి అందగత్తెగా భారతీయ చిత్ర పరిశ్రమలో నీరాజనాలు అందుకుంది. ఎంత వేగంగా వెండితెర మీద ప్రత్యక్షమైందో.. అంతే వేగంగా ఓ మెరుపులా అదృశ్యమైంది. కేవలం 19 ఏళ్ల వయసుకే ఎంతో కిర్తీని సంపాదించుకుంది. ఆమె మరణం భారతదేశాన్ని షాక్‌కు గురిచేసింది. త‌న అందంతో, త‌న పాత్ర‌ల‌తో ఎంత‌గా మీడియా దృష్టిలో ప‌డిందో, అంత‌కంటే ఎక్కువ‌గా త‌న మ‌ర‌ణంతో పాపులర్ అయ్యింది.

1974లో జ‌న్మించిన దివ్య‌ భారతికి 14 ఏళ్ల వ‌య‌సులోనే హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. అయితే ఎందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే డి సురేశ్ బాబు రూపంలో ఆమెకు అదృష్టం వరించింది. వెంక‌టేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘బొబ్బిలి రాజా’ (1990)లో హీరోయిన్‌ కోసం వెతుకుతుండగా దివ్య భారతి ఆయన కళ్లలో పడింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ‘రౌడీ అల్లుడు’, ‘నా ఇల్లే నా స్వ‌ర్గం’, ‘అసెంబ్లీ రౌడీ’ వంటి హిట్ సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. అటు బాలీవుడ్‌లో స‌న్నీ డియోల్‌తో ‘విశ్వాత్మ’ (1992)లో హీరోయిన్‌గా నటించింది. సినిమా ఫ్లాప్ అయినా ఆ మూవీలోని “సాత్ స‌ముంద‌ర్” సాంగ్‌ మాత్రం జనం నోళ్లలో నానింది.

ఆ తర్వాత 1992లోనే ఆమె 12 సినిమాలు చేసిందంటే ఆమె డిమాండ్ ఏ రేంజిలో ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. వాటిలో రెండు తెలుగు సినిమాలు.. ‘చిట్టెమ్మ మొగుడు’, ‘ధ‌ర్మ‌క్షేత్రం’ ఉన్నాయి.‘షోలా ఔర్ ష‌బ్న‌మ్‌’ సినిమా షూటింగ్‌లో హీరో గోవిందాను కలుసుకోవడానికి సాజిద్ న‌దియ‌డ్‌వాలా వచ్చాడు. ఈ క్రమంలో దివ్య భారతి అందానికి అతను ఫిదా అయ్యాడు. ఆ తర్వాత ఇద్దిరి మధ్యా పరిచయం, ప్రేమగా మారింది. చివరికి ఇద్దరూ సీక్రెట్‌గా మ్యారేజ్ సైతం చేసుకున్నారు. సాజిద్ కోసం దివ్య ఇస్లాం మ‌తంలోకి మారి, త‌న పేరును స‌న న‌దియ‌డ్‌వాలాగా మార్చుకుంది.

కానీ ఈ విషయాలు ఎవరికీ తెలియదు.జీవితం సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న దశలో 1993 ఏప్రిల్ 5నే త‌న అపార్ట్‌మెంట్ ‌లోని ఐదో అంత‌స్తు నుంచి కింద‌ప‌డి తీవ్ర గాయాల‌తో దివ్య భారతి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఆమె ఆకస్మిక మ‌ర‌ణం అనేక అనుమానాల‌కు, వివాదాల‌కు తావిచ్చింది. ఆ దుర్ఘ‌ట‌న వెనుక సాజిద్ ఉన్నాడంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ వాటికి సాక్ష్యాధారాలు లేవు. ఇప్ప‌టికీ దివ్య‌భార‌తి మరణం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక మిస్ట‌రీ.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus