పాపులర్ హీరోయిన్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

వినీత (Vineetha) తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఈమె అసలు పేరు లక్ష్మి. కానీ సినిమాల్లోకి వచ్చాక వినీతగా పేరు మార్చుకుంది. 1993 లో శరత్ కుమార్ (Sarathkumar)  హీరోగా వచ్చిన ‘కట్ట బొమ్మన్’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అది పెద్దగా ఆడలేదు. కానీ తర్వాత వచ్చిన ‘ఊజియన్’ వినీతకి మంచి పేరు తెచ్చిపెట్టింది. మలయాళం, తమిళం, తెలుగు.. ఇలా అన్ని భాషల్లోనూ కలుపుకుని 70 కి పైగా సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ‘అల్లుడు పోరు అమ్మాయి జోరు’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది వినీత (Vineetha).

Vineetha

ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు కానీ.. తర్వాత ఈమెకు విక్టరీ వెంకటేష్ (Venkatesh) – దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ (Intlo Illalu Vantintlo Priyuralu) సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో నేపాల్ అమ్మాయిగా ఈమె చాలా చక్కగా నటించింది. ఈమె లుక్స్ కూడా అప్పటి ఆడియన్స్ ని కట్టిపడేశాయి అని చెప్పాలి. ఈ సినిమా హిట్ అవ్వడంతో వినీతకి తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి.. కానీ ఆ తర్వాత పలు వివాదాలు ఈమె కెరీర్ ని స్పాయిల్ చేశాయి.

ముఖ్యంగా 2003లో వినీత వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలు అయ్యింది. తర్వాత బెయిల్ పై రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది. కొన్నాళ్ళకి ఆమె ఎటువంటి తప్పు చేయలేదు అని తేలింది. కానీ ఈలోపే ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమెకు సినిమా ఆఫర్లు రాలేదు. అవకాశాల కోసం అప్రోచ్ అయినా.. ‘ఆడియన్స్ లో నీ క్రేజ్ ముగిసింది’ అంటూ దర్శక నిర్మాతలు మొహం చాటేశారు.

సినీ ఇండస్ట్రీ అంటే.. ఇగోలతో నిండిన పరిశ్రమ అంటుంటారు. మరి వినీత ఎవరి అహం దెబ్బతీసిందో తెలీదు. చెయ్యని తప్పుకి ఎవరో కక్ష్య కట్టి ఆమె జీవితాన్ని నాశనం చేశారు. మిస్ ఇండియా కంటెస్టెంట్ అయినా జైలు పాలవ్వాల్సి వచ్చింది. కెరీర్ నాశనమైంది. సినీ పరిశ్రమలో ఎంత డిప్లొమాటిక్ గా ఉన్నా ఎవరి కెరీర్ కు గ్యారంటీ ఉండదు అనడానికి వినీత జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.

‘రాధే శ్యామ్’ కి 3 ఏళ్ళు.. అక్కడ తేడా కొట్టింది.. ఫలితం మారిపోయింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus