Priyanka Singh: తండ్రి అంధుడు.. చూసేవాళ్లే లేరు.. అంటూ ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్..!

జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు స్టార్స్ అయ్యారు. అందులో నవ్వించిన దానికంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం సాయి తేజ అలియాస్ ప్రియాంక. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి సంచలనం సృష్టించాడు ఇతను. స్క్రీన్‌పై కామెడీ చేసి అందరినీ నవ్వించే తన జీవితంలో చాలా విషాదాలు ఉన్నాయని… సాయితేజగా అందరికీ తెలిసినా కూడా తను మాత్రం చిన్నప్పటి నుంచి అమ్మాయిగా ఉండటానికే ఇష్టపడ్డానని చెప్పింది ప్రియాంక.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక.. తొలి రోజు నుంచి నేటి వరకు తన పర్ఫార్మెన్స్‌తో హౌస్‌లో దూసుకెళ్తోంది. ఇంటిసభ్యులందరితోనూ మంచిగా ఉంటూ.. మంచి రిలేషన్ ని మెయింటేన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సభ్యుల పట్ల కేరింగ్ చూపిస్తుంది. దీంతో ప్రియాంక సింగ్ ను బిగ్ బాస్ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అయితే ప్రియాంక… ట్రాన్స్‌జెండర్‌గా ఎప్పుడు, ఎలా మారిందని చాలా మంది అడిగే ప్రశ్న. దీనికి పలు సందర్భాల్లో ఆన్సర్ ఇచ్చింది పింకీ.

తనలో ఆడ లక్షణాలను గుర్తించిన సాయితేజ.. ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌కు చెప్పకుండా సీక్రెట్‌గా వుంచిందట. బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చిన తర్వాతే ఈ విషయం తన తండ్రికి తెలిసిందని ఓ రోజున బిగ్‌బాస్ హౌస్‌లో చెప్పి కంటెస్టెంట్లు, ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. తన తండ్రికి ఓ ప్రమాదంలో కళ్లుపోతే .. అన్నయ్యలు, చెల్లెల్లు తమకు పట్టనట్లు వెళ్లిపోతే తానే తల్లిదండ్రుల బాధ్యతలు స్వీకరించినట్లు ప్రియాంక చెప్పింది. సినిమాల్లో నటించాలన్నదే తన లక్ష్యమని వెల్లడించింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus