Manasi Sudhir: ‘కాంతార’లో హీరో తల్లిగా చేసిన నటి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.!

కొన్ని సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే నటీనటులను డీ గ్లామరస్ గా చూపిస్తుంటారు. బయట వాళ్ళు అందంగానే ఉన్నా.. పలనా పాత్రకి సహజత్వం రావాలని మేకర్స్ అలా చేస్తూ ఉంటారు. ఇటీవల వచ్చిన కన్నడ సినిమా ‘కాంతార’ ని తెలుగు ప్రేక్షకులు చూసే ఉంటారు. ఆ సినిమా తెలుగు వెర్షన్ కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. తెలుగులో ఈ మూవీ ఏకంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసి.. చరిత్ర సృష్టించింది.

‘కాంతార’ హీరో రిషబ్ శెట్టికి తల్లి పాత్రను పోషించిన మానసి సుధీర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కమల అనే వయసు మీద పడ్డ మహిళగా ఆమె నటించింది. బాధ్యత లేని కొడుకుని చితక్కొట్టే పాత్రలో ఆమె కనిపిస్తుంది. సినిమాలో ఈమె చాలా ఏజ్డ్ పర్సన్ గా కనిపిస్తుంది. అయితే బయట అలా కాదండోయ్. ఈమె గ్లామర్ గానే కనిపిస్తుంది. సినిమా ఈమె నటనను చూసి అంతా ఈమెను సీనియర్ నటి అని కూడా అనుకుంటున్నారు.

కానీ అస్సలు కాదు. ఈమె టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యింది అంతే..! కరోనా లాక్ డౌన్ టైంలో ఈమె చేసిన టిక్ టాక్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ నటి అవ్వమని ఈమెకు సలహా ఇచ్చారు. ఓ సందర్భంలో ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలు అయిన ‘హోంబలే ఫిలింస్’ వారు ఈమెను ఆడిషన్ కు పిలిచి ఆమె పాత్ర గురించి, మేకోవర్ గురించి చెప్పారు. ఈమె ధైర్యంగా ఆ పాత్రను పోషించింది.

35 ఏళ్ల వయసులో హీరోకి తల్లి పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈమెకు కొడుకుగా చేసిన రిషబ్ శెట్టి వయసు 39 సంవత్సరాలు కావడం గమనార్హం. ఇక ‘కాంతార’ తర్వాత మానసి సుధీర్ కు చాలా ఆఫర్లు వస్తున్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి మానసి సుధీర్ బ్యూటిఫుల్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus