మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రాలలో ‘కొండవీటి దొంగ’ కూడా ఒకటి. ‘ప్రసాద్ స్టూడియోస్’ బ్యానర్ పై త్రివిక్రమ్ రావు నిర్మించిన ఈ చిత్రానికి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రజల వద్ద దోచుకుని తినే రాబందులు వంటి రౌడీల దగ్గర నుండీ సంపద కొట్టేసి తిరిగి పేదలకు ఇచ్చి ఆదుకునే పాత్రలో మెగాస్టార్ కనిపిస్తారు. నిజానికి ఐ. ఏ.ఎస్ చదివి కలెక్టర్ అవుదామని అనుకున్న ఓ యువకుడు .. తన ఊరిలో జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేక.. దొంగగా మారతాడు హీరో.
అతన్ని పట్టుకోవాలి అనే పాత్రలో విజయశాంతి ఓ హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ గా రాధ నటించింది. ఈమె డాక్టర్ పాత్రలో కనిపిస్తుంది. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీదేవి ని అనుకున్నారట. అది కూడా ఒక్క హీరోయిన్ మాత్రమే.. అందులోనూ ‘వజ్రాల దొంగ’ పేరుతో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యి ఆ తరువాత ఓ పాట షూటింగ్ అవ్వగానే ఆగిపోయింది. చిరు- శ్రీదేవి ల పైనే ఆ పాటను చిత్రీకరించారు.
కానీ ఎందుకో షూటింగ్ ఆగిపోయింది. తరువాత కొన్నాళ్ళకు నిర్మాత త్రివిక్రమ్ రావు … రైటర్స్ అయిన పరిచూరి బ్రదర్స్ తో కథలో మార్పులు చేయించారు. అలా ఇద్దరు హీరోయిన్ ల పాత్రలను డిజైన్ చేయడం జరిగింది. టైటిల్ కూడా మార్చారు. మరో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేసారు. 1990 మార్చి 9న విడుదలైన ఈ చిత్రం.. మొదట యావరేజ్ టాక్ తో మొదలైనా తరువాత సూపర్ హిట్ గా నిలిచింది.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!