ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన ‘తొలి వలపు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు గోపీచంద్. అయితే ఆ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. తరువాత ‘జయం’ ‘నిజం’ ‘వర్షం’ వంటి సినిమాల్లో విలన్ గా చేసి.. మళ్ళీ ‘యజ్ఞం’ తో హీరోగా మారాడు. ఇక అక్కడి నుండీ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. చాలా కాలం నుండీ సరైన హిట్టు కొట్టలేకపోతున్న గోపీచంద్.. ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ అనే సినిమా కూడా వచ్చింది. ఇదిలా ఉండగా.. 19 ఏళ్ళ తన సినీ కెరీర్లో ఇప్పటి వరకూ గోపీచంద్ ఎటువంటి వివాదంలో చిక్కుకోలేదు.
కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటూ.. తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అయితే గోపీచంద్ లైఫ్ లో చాలా ట్రాజెడీ ఉందన్న సంగతి చాలా మందికి తెలీదు. గోపీచంద్ 8 ఏళ్ళ వయసుకే అతని తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. గోపీచంద్ తండ్రి మరెవరో కాదు ‘నేటి భారతం’, ‘ప్రతి ఘటన’.. వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు టి.కృష్ణ. సినీ ఇండస్ట్రీలో ఇతనికి చాలా మంచి పేరు ఉంది. ఇక గోపీచంద్ రష్యాలో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలోనే అతని అన్నయ్య ప్రేమ్ చంద్ కూడా ఓ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడట. ఆ టైములో వీసా సమస్య వల్ల గోపీచంద్ అతని అన్నయ్య అంత్యక్రియలకు రాలేకపోయాడని తెలుస్తుంది.
ఇక ఇండియాకి వచ్చి చేసిన మొదటి సినిమా ప్లాప్ అవ్వడంతో ఇతనికి ఆర్ధిక ఇబ్బందులు కూడా తలెత్తాయట.ఆ టైములో అవకాశాలు లేక ఈనాడులో న్యూస్ రిపోర్టర్ గా కూడా పనిచేసాడట గోపీచంద్.తరువాత ‘జయం’ సినిమాలో అవకాశం రావడంతో అతని కష్టాలకు ఫుల్ స్టాప్ పడినట్టు తెలుస్తుంది.అప్పటి నుండీ యాక్షన్ సినిమాలు చేసి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎన్నో హిట్లు అందుకున్నాడు. గోపీచంద్ కు ఓ సోదరి కూడా ఉంది. ఆమె డెంటిస్ట్ గా పనిచేస్తుంది. అంతేకాదు మన ప్రభాస్ కు గోపీచంద్ అత్యంత సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే.