ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు పద్మనాభం గురించి ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పటి ప్రేక్షకులకు మాత్రం ఈయన కామెడీకి పెద్ద ఫ్యాన్స్ అనే చెప్పాలి. కేవలం నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఇతను పలు హిట్ సినిమాలు రూపొందించాడు.అయితే మొదట్లో ఎంతటి స్టార్ హోదా ను అనుభవించినా… చివరి రోజుల్లో మాత్రం పేదరికంలో బ్రతికారు. ఇదే సందర్భాన్ని ప్రభాస్ నటించిన ‘చక్రం’ సినిమాలో చూపించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఇదిలా ఉండగా.. ఈయన చిన్నతనంలో ఓ అంధుడి కంచంలో రాయిపెట్టేసి.. ఆ కంచంలో ఉన్న చిల్లర అంతా దొంగతనం చేశాడట. ఆయన చేసిన ఈ పని .. ఆయన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేదట.
దాంతో ‘జాతకరత్న మిడతం బొట్లు’ అనే సినిమాలో ఓ సన్నివేశం కోసం.. నిజమైన అంధుడిని తీసుకొచ్చి .. ఆ సీన్ షూటింగ్ పూర్తయ్యాక కొంతడబ్బు ఇచ్చి పంపించారట పద్మనాభం.ఆయన చిన్నప్పుడు చేసిన పాపానికి పరిహారార్ధంగా లిటిల్ ఫ్లవర్ ‘బ్లైండ్ అండ్ డెఫ్’ అనే సంస్థకు ఆ రోజుల్లోనే 5000 రూపాయలు విరాళంగా ఇచ్చారట.అయితే సినీ ఇండస్ట్రీలో మంచితనం ఎప్పుడూ పనిచెయ్యదు అని చాలా మంది చెబుతుంటారు. అందుకే పద్మనాభం కూడా చాలా నష్టపోయారట. నిజానికి 1975లో ‘సినిమా వైభవం’ అనే చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద 60 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. దానికి గ్యారెంటీగా ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’, ‘శ్రీరామకథ’ వంటి చిత్రాల నెగటివ్లను అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టారట. ‘6 నెలల్లోపే అప్పు తీర్చెయ్యాలి లేదంటే ఆ సినిమా హక్కులను ఆ వ్యక్తి సొంతం చేసుకుంటాడు’ అనేది ఎగ్రిమెంటు.
అయితే పద్మనాభం ఆ 6 నెలల్లో అప్పు తీర్చలేకపోయారట. ఈ కారణంగా ఆ వ్యక్తి ఆ సినిమాల హక్కులను సీడెడ్, ఆంధ్రా, నైజాం ఏరియాలకు 2.75లక్షలకు అమ్మేశారట. 60 వేల అప్పు తీరిపోగా మిగిలిన డబ్బుని ఆ వ్యక్తి.. పద్మనాభంకు ఇవ్వలేదట. కనీసం ఆ సినిమా నెగటివ్లు కూడా తిరిగి ఇవ్వలేదట. దీని పై పద్మనాభం ఆ వ్యక్తి పై కేసు వేశారని తెలుస్తుంది. ఆ కేసు 1983 వరకూ కోర్టులో నడిచింది. అయినా .. పద్మనాభానికి న్యాయం జరగలేదట. అయితే పద్మనాభం శ్వాస విడిచిన తరువాత .. సదరు అప్పు ఇచ్చిన వ్యక్తి.. పద్మనాభం కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు అలాగే నెగటివ్లు అందజేసినట్టు తెలుస్తుంది. వినడానికే చాలా బాధా కరంగా ఉంది కదూ..!
Most Recommended Video
కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే