Swayamvaram: 23 ఏళ్ళ ‘స్వయంవరం’ మూవీ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

  • April 23, 2022 / 04:54 PM IST

తొట్టెంపూడి వేణు హీరోగా లయ హీరోయిన్ గా కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్వయంవరం’. 1999 వ సంవత్సరంలో ఏప్రిల్ 22న ఈ మూVవీ రిలీజ్ అయ్యింది. ‘ఎస్.పి.ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై వెంకట్ శ్యామ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.ప్రేమకి పెళ్ళికి మధ్య సతమతమయ్యే ఓ కుర్రాడి కధే ఈ ‘స్వయంవరం’. నేటితో ఈ మూవీ విడుదలై 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘స్వయంవరం’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం రండి :

1)’స్వయంవరం’ మూవీ ద్వారా తొట్టెంపూడి వేణు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి ఇతను సీనియర్ స్టార్ డైరెక్టర్ భారతీ రాజా దర్శకత్వంలో హీరో ఎంట్రీ ఇవ్వాలి. వీళ్ళ కాంబినేషన్లో ఓ మూవీ కూడా మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.

2) ఆ టైములో వెంకట్ శ్యామ్ ప్రసాద్… ‘ఎస్.పి.ఎంటర్టైన్మెంట్స్’ అనే సంస్థని స్థాపించి ఓ సినిమా నిర్మించాలని చూస్తున్నాడు. ఇతని హీరో వేణుకి మంచి స్నేహితుడు కావడం.. పైగా వేణు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉండడంతో ఇతన్ని హీరోగా లాక్ చేసుకున్నాడు.

3) ఈ నేపథ్యంలో వెంకట్ శ్యామ్ ప్రసాద్ కథల అన్వేషణ మొదలైంది. అతని వద్దకి వచ్చే కథలన్నీ పెద్ద బడ్జెట్ తో కూడుకున్న కథలు. మొదటి సినిమాతోనే అంత రిస్క్ చేసే ఆలోచన ఆ టైములో అతనికి లేదు.

4) ఈ నేపథ్యంలో ఓ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే కుర్రాడు వచ్చి రెండు కథలు వినిపించాడు. అందులో ఒకటి క్లాస్ స్టోరీ కావడం.. దానికి ‘స్వయంవరం’ అనే టైటిల్ ఫిక్స్ చేయడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ కథని డీల్ చేసే దర్శకుడు కావాలి. త్రివిక్రమ్ కు ఆ టైములో డైరెక్షన్ చేసే ఉద్దేశం లేదు. అతనికి ఆ టైములో డైరెక్షన్ పై అవగాహన కూడా లేదు. మరో పక్క నిర్మాత వెంకట్ శ్యామ్ ప్రసాద్ కూడా కొత్త వాళ్ళతో సినిమా చేసే ఉద్దేశంలో లేదు. అయితే త్రివిక్రమ్ కథ చెప్పిన విధానం నచ్చి అతనైతే ఓకె అని చెప్పాడట. కానీ ఆ టైములో మన గురూజీకే ఇంట్రెస్ట్ లేదు.

5) ఇలాంటి టైములో వెంకట్ శ్యామ్ ప్రసాద్ కు విజయ భాస్కర్ పరిచయమయ్యాడు. విజయ భాస్కర్ గారు ఆల్రెడీ ‘ప్రార్థన’ అనే మూవీతో డైరెక్టర్ గా మారారు. 1991 వ సంవత్సరంలో సురేష్ హీరోగా వచ్చిన ఆ మూవీ పెద్ద ప్లాప్ అయ్యింది. కానీ ఆ సినిమా లైన్ బాగుంటుంది. టేకింగ్ సీరియస్ గా ఉండడంతో జనాలకి కనెక్ట్ కాలేదు. దాంతో ఒక సినిమాని డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి.. విజయభాస్కర్ గారిని దర్శకుడిగా ఫైనల్ చేశారు శ్యామ్ ప్రసాద్.

6) ‘భద్రం కొడుకో’ అనే చిన్న పిల్లల మూవీలో నటించిన లయ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. వేణు, లయ పెయిర్ కొత్తగా చాలా ఫ్రెష్ గా అనిపించింది.

7) నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమాలకి సంగీతం అందించే వందేమాతరం శ్రీనివాస్ ను.. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఆయన ఈ చిత్రానికి ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించారు. ‘పికాసో చిత్రమా’ ‘కీరవాణి రాగంలో’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

8) త్రివిక్రమ్ రైటింగ్ కు విజయ భాస్కర్ టేకింగ్ కు వేణు నటనకి.. చాలా బాగా కుదిరింది. ఈ మూవీలో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది.

9)అనుకున్న దానికంటే కూడా ఇంకా ముందుగానే సినిమాని కంప్లీట్ చేసి విడుదల చేశారు.చాలా చోట్ల నిర్మాత అడ్వాన్స్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. మొదటి రోజు థియేటర్లలో జనాలు పెద్దగా లేరు. కానీ ఈవెనింగ్ షోలకి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి పలు చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. రెండో రోజు నుండీ ఈ మూవీ పుంజుకుంది. తొలివారంలోనే ఈ మూవీకి నిర్మాత పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసింది. ఫుల్ రన్లో నిర్మాతకి భారీ లాభాలను అందించింది.

10) విజయ్ భాస్కర్ కు లైఫ్ ఇచ్చిన మూవీ ఇదైతే.. వేణు, లయ, త్రివిక్రమ్ లకి శుభారంభాన్ని ఇచ్చిన మూవీగా నిలిచింది.

11) ఆ ఏడాదికి గాను ఉత్తమ సంగీతం, స్పెషల్ జ్యురీ, బెస్ట్ సింగర్ కేటగిరీల్లో 3 నంది అవార్డులు దక్కించుకుంది ఈ మూవీ.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus