ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రజలకు తెలియని నిజాలు చూపిస్తాం

Ad not loaded.

మహానటుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా సినిమా రూపుదిద్దికుంటోంది. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయి ఆకట్టుకుంది. టీజర్ వస్తుందని ఆశపడ్డ అభిమానులు కొంత నిరాశపడినప్పటికీ.. ఫస్ట్ లుక్ వారిని సంతోషపెట్టింది. ఈరోజు ఎన్టీఆర్ 22వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌ ఘాట్‌ సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్‌లో ఎన్‌ అంటే ఆయన ఇల్లే నటనాలయం ఆయనే నటరాజు. టీ అంటే తారామండలంలోని తారక ధృవతారకుడు. ఆర్‌ అంటే రారాజు రాజకీయ దురందరుడు. రమణీయ రమ్య సుందరుడు.

ఆలోచనే కాదు… అప్పటివరకూ అమల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన వ్యక్తి’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఎన్టీఆర్‌ పేరు పేదవారి హృదయ స్పందన. భూమి మీద ఎందరో పుడతారు..గిడతారు. కానీ అందరూ మహానుభావులు కాలేరు. మాటలు కాకుండా చేతల్లో చేసి చూపి తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింప చేసిన మహానుభావుడు. ఈ ఏడాది మార్చిలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్‌ గురించి ప్రజలకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ సినిమాలో వాటిని చూపిస్తాం.” అని వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus