క్లిన్ కారా తో బతుకమ్మ ఆడిన ఉపాసన.. వీడియో వైరల్!

తెలంగాణలోని ఆడపడుచులు అందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకొనే పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి. తొమ్మిది రోజులపాటు వివిధ రకాల బతుకమ్మలను అందమైన పువ్వులతో అందంగా అలంకరించి పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటారు. ఇక సద్దుల బతుకమ్మ పండుగను మరింత వైభవంగా జరుపుకుంటారు. ఈ విధంగా సద్దుల బతుకమ్మను చాలా పెద్దగా అలంకరించి బతుకమ్మ చుట్టు పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ ఆటపాటలతో ఎంతో ఆనందంగా గడుపుతారు. ఈ క్రమంలోనే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో వేడుకగా జరుపుకున్నారు.

ఇక ఈ పండుగను సేవా సమాజ్ బాలిక నిలయంలో ఉన్నటువంటి వారితో కలిసి మెగా కుటుంబ సభ్యులు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. చిరంజీవి సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్ ఉపాసన దంపతులు అలాగే వైష్ణవ తేజ్ , తల్లిగారు శ్రీజ తన పిల్లలందరూ కలిసి కూడా ఈ పండుగను జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇక తన కుమార్తె క్లిన్ కారా పుట్టిన తర్వాత మొదటిసారి వచ్చినటువంటి బ్రతుకమ్మ పండుగ కావడంతో ఉపాసన తన కుమార్తెతో కలిసి ఈ బతుకమ్మ వేడుకలలో పాల్గొని పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనాలు నాకు శక్తిని ఇస్తే కుటుంబం బలాన్ని ఇస్తుంది.

ఎంతో ప్రత్యేకమైన దసరా పండుగ రోజు అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడిపే శక్తి మనలో నింపుకొని సానుకూల దృక్పథాన్ని పెంచుదాం. మా అమ్మమ్మ ఆచరించే సాంప్రదాయం దసరా పండుగను సజీవంగా ఉంచుతుంది. బాలిక నిలయంలో దసరా వేడుకలు సంతోషాన్ని పంచుకున్నాం అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus