Upasana: పిల్లల విషయంలో ఎన్నో మాటలు అన్నారు!

ఉపాసన తన తాతయ్య ప్రతాపరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈమె చెన్నై వెళ్లారు. తన తాతయ్య పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈమెకు ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురవడంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు. ఇక ఉపాసన రాంచరణ్ వివాహమైన తర్వాత పిల్లలను చాలా ఆలస్యంగా ప్లాన్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

దాదాపు వీరి పెళ్లి అయిన పది సంవత్సరాలకు పిల్లలను ప్లాన్ చేసుకున్నారు రాంచరణ్ పెళ్లి అయిన 11 ఏళ్లకు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఇలా రామ్ చరణ్ ఉపాసన పిల్లలను ఆలస్యంగా ప్లాన్ చేయడం గురించి అప్పట్లో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. తాజాగా పిల్లల విషయంలో ఉపాసనకు ప్రశ్న ఎదురవుతూ.. దాదాపు పదేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు ఎలా ఫీలవుతున్నారనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఉపాసన (Upasana) సమాధానం చెబుతూ ప్రతి ఒక్కరూ కూడా తల్లి కావడం చాలా గ్రేట్ అనుకుంటారు. నేను మాత్రం డబల్ గ్రేట్ అని ఫీల్ అవుతాను. పెళ్లి తర్వాత చాలామంది పిల్లల్ని ఎప్పుడు కంటారు అంటూ ప్రశ్నించారు. ఇక చాలామంది మాకు ఏదైనా సమస్య ఉందేమోనని కూడా మాట్లాడారు. ఈ మాటలు నా వరకు కూడా వచ్చాయని ఉపాసన తెలిపారు.

కానీ పిల్లల్ని కనడానికంటే ముందుగా మేము అన్ని విధాల సిద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాము. అందుకే ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus