Upasana, Ram Charan: రామ్‌చరణ్‌ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుందంటే… ఉపాసన కామెంట్స్‌ వైరల్‌!

Advertisement

కూతుళ్లు ఎప్పుడు నాన్న కూచీలే అవుతారు అంటుంటారు. ఆ మాటను నిజం చేస్తున్న కుమార్తెలను మీరు చూసే ఉంటారు కూడా. అయితే ఆ నానుడికి తగ్గట్టే క్లీంకార కూడా నాన్నను చూస్తే చాలా స్పెషల్‌ అయిపోతుందట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు ఉపాసననే. ఇటీవల వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఉపాసన ఓ ఇంటర్వ్యూలో ‘క్లీంకార – రామ్‌చరణ్‌’ గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు.

తన తాత అపోలో ప్రతాప్‌ రెడ్డి 91వ జన్మదినం సందర్భంగా ఉపాసన స్పెషల్ బుక్‌ను లాంచ్ చేశారు. తన కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణులు ఉన్నందుకు గర్వపడుతున్నాను అని ఘనంగా చెప్పుకొచ్చారామె. ఉపాసన తాతే కాదు.. క్లీంకార తాత కూడా పద్మ విభూషణే అంటూ ఉపాసన సంబరపడిపోయారు. ఈ క్రమంలో క్లీంకార – చరణ్‌ గురించి ప్రస్తావన వచ్చింది. వాళ్లిద్దరి గురించి మాట్లాడాలంటే తనకు జెలసీగా ఉందని అన్నారు ఉపాసన.

మామూలుగానే కూతుళ్లు ‘డాడ్ లిటిల్ ప్రిన్సెస్‌‌’ అని, క్లీంకార కూడా అంతేనని చెప్పారు. క్లీంకార తన తండ్రి అంటేనే ఎక్కువగా ఇష్టపడుతుందట. తండ్రిని చూడటంతోనే కను రెప్పలు తెగ ఆడించేస్తుందట, ఓ స్పెషల్‌ స్మైల్‌ ఇచ్చేస్తుందట. అదంతా చూసి తనకు జెలసీగా ఉంటోందని ఉపాసన చెప్పుకొచ్చారు. క్లీంకార బాధ్యతల్ని ఇద్దరం సరి సమానంగా పంచుకుంటామని ఉపాసన తెలిపారు. తాను బిజీగా ఉన్నప్పుడు చరణ్ చూసుకుంటాడట. అలాగే చరణ్ బిజీగా ఉన్నప్పుడు తాను చూసుకుంటానని చెప్పారామె.

ఇక రామ్ చరణ్ (Ram Charan) కెమిస్ట్రీ తనతోనే బాగుంటుందని, హీరోయిన్లు ఎవరూ తన పక్కన నటించినా అంతగా సూట్ అవ్వదని ఉపాసన కామెంట్స్‌ చేశారు. హీరోయిన్లు ఆయన పక్కన నటించినప్పటి కంటే తన పక్కనే ఉన్నప్పుడు చూడబుల్‌గా ఉంటుందని ఆమె ఆలోచన. ఇదంతా చూస్తున్న నెటిజన్లు ఉపాసన జెలసీ ఎంత బాగుందో అని అంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మీరు కూడా చూసే ఉంటారు లెండి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read