Upasana, Ram Charan: రామ్ చరణ్ కు ఉపాసన తాత అలాంటి కండిషన్ పెట్టారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినీ కెరియర్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ఉపాసన కామినేని గత 11 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఉపాసన రాంచరణ్ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇక వీరి వివాహం జరిగిన 11 సంవత్సరాలకు ఈ దంపతులకు చిన్నారి జన్మించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే ఉపాసన రాంచరణ్ పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో వీరు పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకోవాలంటే ఉపాసన తాతగారు డాక్టర్ సి ప్రతాపరెడ్డి రామ్ చరణ్ చిరంజీవి లకు ఒక కండిషన్ పెట్టారట.

ఆ కండిషన్ కి ఒప్పుకునేలా అయితేనే వీరిద్దరి వివాహం జరుగుతుందని తేల్చి చెప్పారట. మరి చిరంజీవికి రామ్ చరణ్ కు ఉపాసన తాతగారు ఎలాంటి కండిషన్ పెట్టారు ఏంటి అనే విషయానికి వస్తే… చాలామంది పెళ్లిళ్ల తర్వాత తమ భార్యలను కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేస్తున్నారు వారికంటూ స్వతంత్రంగా ఎదిగే హక్కు కల్పించడం లేదు. అయితే ఉపాసన విషయంలో అలా జరగకూడదని తాను ఏ పని చేసినా తనకంటూ స్వేచ్ఛ కల్పించాలని తన పని విషయంలో ఆంక్షలు పెట్టకూడదు అంటూ కండిషన్ పెట్టారట.

ఈ విధంగా ఉపాసన (Upasana) తాతగారు కండిషన్ పెట్టడంతో ఆ కండిషన్ కి చిరంజీవి రాంచరణ్ ఇద్దరు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇక పెళ్లి తర్వాత ఉపాసనకు ఏ విధమైనటువంటి అడ్డు చెప్పకుండా తను ఎదుగుదలకు మెగా ఫ్యామిలీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకోవడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus