Upasana: ఉపాసన రామ్ చరణ్ ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మెగా కోడలుగా అడుగుపెట్టిన ఉపాసన కామినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ ప్రతాపరెడ్డి మనవరాలిగా ప్రస్తుతం అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా వ్యాపార రంగంలో ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఉపాసన మెగా కోడలుగా అడుగుపెట్టారు. ఈ విధంగా ఎంతో ఉన్నత ఫ్యామిలీకి చెందినటువంటి ఉపాసన బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించారు అయితే ఈమె పేరున ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయి వీరి ఆస్తులు విలువ ఎంత అనే విషయానికి వస్తే…

దేశంలో టాప్ 100 బిలినియర్స్ లో ఒకరైనటువంటి ప్రతాపరెడ్డి నికర ఆస్తుల విలువ సుమారు 21,000 వేల కోట్ల రూపాయలు ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈయన మనవరాలు ఉపాసన వ్యాపార రంగంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఈ అపోలో హాస్పిటల్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.70,000 కోట్లుగా ఉందని తెలుస్తుంది. ఇక ఉపాసన పేరు మీదట ఏకంగా 1130 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఈమె మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టి అక్కడ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా మెగా ఇంటి పరువు ప్రతిష్టలను కూడా కాపాడుతూ వస్తున్నారు. ఇక ఉపాసన రాంచరణ్ సతీమణిగా మంచి గుర్తింపు పొందారు. ఇక రాంచరణ్ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు ఈయన కూడా భారీగానే ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తుంది. ఇలా ఉపాసన రామ్ చరణ్ ఆస్తులు విలువ 2500 కోట్ల రూపాయలు ఉంటాయని సమాచారం.

ఇక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ కన్నా (Upasana) ఉపాసనని బాగా ధనవంతురాలని తెలుస్తోంది. ఇక ఉపాసన రాంచరణ్ దంపతులు పెళ్లి అయిన పది సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా పెళ్లి తర్వాత 10 సంవత్సరాలకు ఉపాసన తల్లి కావడంతో పెద్ద ఎత్తున మెగా అభిమానులు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus