Upasana: బాబాయ్ అంటూ కీరవానికి స్పెషల్ విషెస్ చెప్పిన ఉపాసన!

మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా ప్రమోట్ అయిన విషయం మనకు తెలిసిందే. పెళ్లైన పది సంవత్సరాలకు ఈమె తల్లి కాబోతున్నారన్న శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. జూన్ 20వ తేదీ ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ చిన్నారికి క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ ఉపాసన ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా తాజాగా ఉపాసన ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ క్యాటగిరిలో భాగంగా ఎంపికైన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో సంగీత దర్శకుడు కీరవాణి రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలోనే జులై 4వ తేదీ కీరవాణి పుట్టినరోజు కావడంతో ఉపాసన తనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాసన స్పందిస్తూ.. నాటు నాటు పాట స్టెప్పులకు వింబుల్డన్ లో టెన్నిస్ ఆటగాళ్లు డాన్స్ చేస్తున్న ఫోటోని షేర్ చేశారు.

ఈ విధంగా ఉపాసన (Upasana) ఈ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే కీరవాణి బాబాయ్ అంటూ ఈమె ఎంతో ఆప్యాయంగా కీరవాణి గారికి శుభాకాంక్షలు చెబుతూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ఈ పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ పొందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు పొందారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus