Upasana: బాలీవుడ్ సినిమాలపై అలాంటి కామెంట్స్ చేసిన ఉపాసన!

మెగాకోడలు ఉపాసన ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటు టాలీవుడ్ సినిమాలు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. తాను పెళ్లి కాకముందు టాలీవుడ్ సినిమాలు కంటే బాలీవుడ్ సినిమాలను ఎక్కువగా చూసేదానినని నాకు బాలీవుడ్ సినిమాలు అంటే ఎక్కువగా ఇష్టం అంటూ ఈ సందర్భంగా ఉపాసన కామెంట్ చేశారు. తమకు చిన్నప్పటినుంచి కూడా కుటుంబంలో ఎవరు కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు లేరు అందుకే నాకు తెలుగు మాట్లాడటం రాయడం కూడా రాదు అంటూ ఉపాసన తెలియజేశారు

మా తాతయ్య ఉర్దూలో బాగా మాట్లాడుతారు ఆయన ఇప్పటికీ ఉర్దూ చాలా స్పష్టంగా రాస్తారని ఉపాసన తెలిపారు. ఇక నాన్న కూడా ఉర్దూ మాట్లాడేవారు నానమ్మ ఇంగ్లీష్ మాట్లాడుతుంది కాబట్టి మాకు ఇంట్లో తెలుగు మాట్లాడే అవకాశం కూడా వచ్చేది కాదని తెలిపారు. ఇక అప్పట్లో దూరదర్శన్ లో శనివారం హిందీ సినిమా ఆదివారం తెలుగు సినిమా వచ్చేది

ఇలా తెలుగు సినిమాలను చూసేవాళ్ళం తెలుగు సినిమాలలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయని కాకపోతే సినిమా పేర్లు గుర్తులేవు అంటూ తెలిపారు. ఇలా ఇంట్లో ఎవరు కూడా తెలుగు మాట్లాడేవారు లేకపోవడంతో మాకు తెలుగు అలవాటు లేదని అందుకే బాలీవుడ్ సినిమాలు మా లైఫ్ లో ఒక పార్ట్ అయ్యాయని ఈమె తెలియజేశారు. అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చాలా బాగా చూశామనీ,ఆ సినిమా బాగా నచ్చిందని తెలిపారు.

ఇక మెగా ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన తర్వాత తెలుగు సినిమాలు చూస్తున్నానని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు. అప్పుడు కూడా తెలుగు సినిమాలు చాలా తక్కువగా చూసే వాళ్ళం కానీ సినిమా పేర్లు గుర్తులేవు అంటూ తెలుగు సినిమాల గురించి ఉపాసన (Upasana) చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus