Vijay Antony: విజయ్‌ ఆంటోనీ హెల్త్‌ అప్‌డేట్‌.. అప్పుడు టీమ్‌ అబద్దం చెప్పిందా?

ప్రముఖ నటుడు విజయ్‌ ఆంటోనీకి గాయాలయ్యాయి అని కొందరు, తీవ్ర గాయాలని కొందరు రకరకాలు ఆ మధ్య చెప్పారు. దీంతో అసలు ఏమైందా అని ఎంక్వైరీ చేస్తే.. పెద్ద గాయాలేమీ కాదు, అంతా ఓకే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అంటూ టీమ్‌ చెప్పుకొచ్చింది. దీంతో హమ్మయ్య అనుకున్నారు అభిమానులంతా. అయితే అప్పుడు టీమ్‌ అబద్దం చెప్పిందా? ఏమో విజయ్‌ ఆంటోనీ లేటెస్ట్ ట్వీట్‌ చూస్తుంటే అవును అనే అనిపిస్తోంది. ఎందుకంటే విజయ్‌ ఆంటోనికి పెద్ద గాయాలే తగిలాయి కాబట్టి.

నేను క్షేమంగా ఉన్నాను. వీలైనంత త్వరగా అందరితో మాట్లాడతాను అంటూ విజయ్‌ ఆంటోని మంగళవారం రాత్రి ఓ ట్వీట్‌ చేశారు. ఆసుపత్రిలో బెడ్‌ మీద ఉండి థమ్సప్‌ సైన్‌ను ఫొటో తీసి ట్వీట్‌కి యాడ్‌ చేశారు. దాంతోపాటు తన హెల్త్‌ అప్‌డేట్‌ గురించి కూడా రాసుకొచ్చారు. ‘‘నా దవడ, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వాటిని సంబంధించి మేజర్‌ సర్జరీ పూర్తయింది. త్వరలోనే మీ అందరితో మాట్లాడతా’’ అని పేర్కొన్నారు విజయ్‌ ఆంటోని.

విజయ్‌ ఆంటోని స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘బిచ్చగాడు 2’. గతంలో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా ‘బిచ్చగాడు’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. కొత్త సినిమా కోసం మలేసియాలో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. దీని కోసం టీమ్‌తో సహా అక్కడకు వెళ్లారు విజయ్‌ ఆంటోని. అక్కడే ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స కోసం చెన్నై వచ్చేశారు. ఆ సమయంలో టీమ్‌ను సంప్రదిస్తే అంతా ఓకే అనేలా చెప్పారు. కానీ ఇప్పుడు సర్జరీ అని విజయ్‌ చెప్పుకొచ్చారు.

దీంతో అభిమానులు కంగారు పడకూడదనే ఉద్దేశంలోనే విజయ్‌ ఆంటోని టీమ్‌ అప్పుడలా చెప్పింది అని అంటున్నారు. దీంతో మరోసారి విజయ్‌ ఆంటోని అభిమానుల మనసులో మరోసారి ఆందోళన నెలకొంది. పెద్ద సర్జరీ అంటున్నారు. అసలు ఏమైంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ‘బిచ్చగాడు 2’ కోసం డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీన్స్ చేయాలని అనుకోవడం వల్లే యాక్సిడెంట్ అయినట్లు సమాచారం. దీంతో జాగ్రత్తగా ఉండండి విజయ్‌ అంటూ ఫ్యాన్స్‌ ట్వీట్లు చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus