పోటీతో రిలీజ్ అవసరమా..?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హిట్టు రాక ఇబ్బంది పడుతున్నాడు. అతడు చివరిగా నటించిన సినిమా ఏదో కూడా జనాలకు గుర్తులేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో ‘మోసగాళ్ళు’ అనే సినిమా చేశాడు. దీన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా తెరకెక్కించాడు. జెఫ్రీ లీ చిన్ అనే హాలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. మంచు విష్ణు స్థాయికి మించి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

కాజల్, సునీల్ శెట్టి వంటి తారలు నటించిన ఈ సినిమాను ఐటీ స్కామ్ ఆధారంగా రూపొందించారు. లాక్ డౌన్ లో ఈ సినిమా ఒటీటీలో రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. సడెన్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 11న మహాశివరాత్రి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారట. అయితే ఇదే సమయానికి శర్వానంద్ ‘శ్రీకారం’, శ్రీవిష్ణు ‘గాలి సంపత్’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

మంచు విష్ణు హిట్ అందుకొని చాలా కాలం అవుతుంది కాబట్టి సోలోగా తన సినిమాను రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేసుకోవాల్సింది. లేదనే పోటీ తక్కువ ఉన్న సమయంలోనైనా రిలీజ్ పెట్టుకోవాల్సింది. అలా కాకుండా మూడు సినిమాలు పోటీగా పైగా మార్చిలో ఎలాంటి పండగలు లేని సమయంలో సినిమాను రేసులోకి దింపడం రిస్క్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus