NTR30: ఎన్టీఆర్30 మూవీ హీరోయిన్ విషయంలో వాస్తవాలు ఇవే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పటివరకు ఫైనల్ కాలేదు. అయితే గత కొన్ని రోజులుగా సమంత ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిందని ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్లే సమంత ఈ సినిమాకు దూరం కావాల్సి వచ్చిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే వైరల్ అవుతున్న వార్తలు నిర్మాతలకు నవ్వు తెప్పించాయని సమాచారం. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ సినిమా నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. గతంలోనే అలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ కాగా కొన్ని కారణాల వల్ల అలియా భట్ తర్వాత రోజుల్లో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. వాస్తవానికి అలియా భట్ రెమ్యునరేషన్ తెలుగులో మిడిల్ రేంజ్ హీరోల రెమ్యునరేషన్ కు సమానంగా ఉంది.

అలియా భట్ రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే సమంత రెమ్యునరేషన్ చాలా తక్కువనే సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైన తర్వాత హీరోయిన్ ను ఫైనల్ చేసి నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. తారక్ సినిమాలో హీరోయిన్ గా నటించాలని ఆశ పడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.

జాన్వీ కపూర్, దీపికా పదుకొనే తారక్ అంటే తమకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు తారక్ రేంజ్ పెరుగుతుండగా కొరటాల శివ సినిమాతో తారక్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ గత సినిమా ఆచార్య ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమా ఫ్లాపైందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus