లివింగ్ లెజెండ్ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. హాస్పిటల్ లో చేరానని, నాకు ఏమీ కాదని, ఎవరు తనకు ఫోన్ చేయవద్దని ఆయన ఆ సందేశంలో చెప్పడం జరిగింది. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల సుబ్రమణ్యాన్ని నేడు ఐ సి యూ కి షిఫ్ట్ చేశారన్న వార్త చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురిచేసింది.
ఆయన ఆరోగ్యం విషమించినట్లు వార్తలు ప్రచారం కావడం జరిగింది. ఐతే బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెవుతున్నాయి. ఆయన కోలుకుంటునట్లు డాక్టర్స్ చెవుతున్నారు. అలాగే బాల సుబ్రహ్మణ్యం ఆసుపత్రిలో ఐ సి యూ బెడ్ పై ఉన్న ఓ ఫోటో సైతం బయటికి వచ్చింది. ఆ ఫొటోలో బాలు గారు థమ్స్ అప్ సింబల్ చూపిస్తూ నేను క్షేమంగానే ఉన్నానని ఆయన అభిమానులకు, పరిశ్రమ ప్రముఖులకు చెప్పారు.
ఇక సోషల్ మీడియాలో బాలు ఆరోగ్య పరిస్థితి వైరల్ కాగా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖులు మరియు సామాన్యులు కోరుకుంటున్నారు. ఆయనకు ఏమి కాదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని అన్ని భాషలలో వేల పాటలు పాడిన బాలుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక అనేక జాగ్రత్తల మధ్య జీవనం సాగిస్తున్న ప్రముఖులు కరోనా బారిన పడడం ఎవరికీ అంతుపట్టడం లేదు. సింగర్ స్మితకు కరోనా సోకగా, ఆమె నాలుగు నెలలుగా ఇంటిలోనే ఉన్నాను అని చెప్పడం విశేషం.