రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా అప్డేట్.!

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం తనను సంసిద్ధం చేసుకుంటూ అదే సందర్భంలో ‘ఐ.పీ.ఎల్’ కొత్త సీజన్ తెలుగు వెర్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇవాళ తాను నటించిన ఐ.పీ.ఎల్ ప్రోమోల విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. మీడియా రాజమౌళి మల్టీస్టారర్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా “రాజమౌళి ఇంకా మాకు కథ కూడా పూర్తిగా చెప్పలేదు, చిన్న లైన్ చెప్పాడు అంతే. సినిమాకి మాత్రం రెడీ అవ్వమన్నాడు” అని చెప్పిన ఎన్టీఆర్ తాతగారి జీవితం ఆధారంగా బాలయ్య టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న “ఎన్టీఆర్” బయోపిక్ లా నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు..

“నాకైతే ఆ సినిమా నుంచి ఎటువంటి పిలుపు రాలేదు, వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను” అని సమాధానమిచ్చాడు. అలాగే ఈ ఐ.పి.ఎల్ సీజన్ లో తాను హైద్రాబాద్ సన్ రైజర్స్ కి సపోర్ట్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు. ఇకపోతే.. తన ఫిజికల్ ట్రాన్స్ ఫార్మేషన్ కేవలం సినిమాల కోసమే కాదని తన కోసం కూడానని ఎన్టీఆర్ పేర్కొనడం విశేషం.ఎన్టీయార్-త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ ఈ నెల మూడోవారం నుంచి మొదలవ్వనుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus