ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు ఉపేంద్ర గురువారం బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారని.. తీవ్ర అస్వస్థతకు గురైన ఉపేంద్ర షూటింగ్లో ఉన్నట్టుండి కుప్ప కూలిపోయారని.. దీంతో ఆయనకు ఏం జరిగిందోనని శాండల్ వుడ్ ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారని.. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందనే వార్తలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి..గురువారం నాడు ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఉపేంద్ర, సడెన్‌గా సెట్లో కుప్పకూలిపోయారు.
ఆయన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని.. ఊపిరి ఆడకపోవడం వల్లే ఇలా జరిగిందని వార్తలొచ్చాయి. అయితే ఇది జరిగిన వెంటనే చిత్రబృందం ఉపేంద్రను ఆస్పత్రికి తరలించారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని సమాచారం అందింది.. అయినా కానీ గతకొద్ది రోజులుగా వరుసగా జరుగుతున్న హఠాత్ పరిణామాలు సినీ పరిశ్రమను షాక్‌కి గురిచేస్తున్న నేపథ్యంలో ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త ఇండస్ట్రీ వారిని, అభిమానులను కలవరపాటుకి గురిచేసింది.
రీసెంట్గా తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై రియల్ స్టార్ ఉపేంద్ర స్పందించారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వార్తల విషయంలో అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని షూటింగ్ స్పాట్ నుండి ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను.. తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నాను.. ఎవరూ ఆందోళన చెందవద్దు.. షూటింగ్ లొకేషన్లో దుమ్ము ఎక్కువగా ఉండడం వల్ల కాస్త ఇబ్బంది పడ్డాను.. దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకుని వచ్చాను’’ అని వివరించారు.
షూటింగ్ లొకేషన్లో ఉపేంద్రతో పాటు యూనిట్ సభ్యులున్నారు. తెలుగు వారికి పరిచయం ఉన్న పాపులర్ ఫైట్ మాస్టర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ థ్రిల్లర్ మంజు తనతో ఉన్నట్లు వీడియోలో చూపించారు ఉపేంద్ర. ఆయన ఆరోగ్యం కుదుటపడిందనే విషయం తెలియడంతో కన్నడ సినీ పరిశ్రమ వర్గాల వారు, ఉపేంద్ర అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.