కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra Rao) సినిమాలు అన్నీ రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. కంటెంట్ కి బోల్డ్ నెస్ యాడ్ చేస్తే అది ఉపేంద్ర సినిమా అని భావించే వాళ్ల సంఖ్య ఎక్కువ. అంతేకాదు హీరోగా కూడా డిఫరెంట్ రోల్స్ చేయొచ్చు అని చాటి చెప్పింది ఉపేంద్రనే. ‘A’ ‘ఉపేంద్ర’ ‘రా’ వంటి సినిమాలతో అలరించిన ఉపేంద్ర… ‘UI ది మూవీ’ ( UI The Movie) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉపేంద్ర డైరెక్షన్లో రూపొందిన సినిమా ఇది.
లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ (Sreekanth K.P) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. నవీన్ మనోహరన్ (G. Manoharan) సహా నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై కొందరి దృష్టి పడింది. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ సినిమాని కొంతమంది టాలీవుడ్ పెద్దలకి చూపించారట.
వారి టాక్ ప్రకారం ఈ సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్..లు పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు మేకర్స్ ను అభినందించాలి అంటున్నారు. ఉపేంద్ర దర్శకుడిగానే కాకుండా నటనతో కూడా మంచి మార్కులు వేయించుకున్నారట. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని, ఫిలిం మేకింగ్లో క్వాలిటీ కనిపించిందని, అటెన్షన్ పే చేసి చూసేలా…
చాలా సీన్లు ఉన్నాయని, వాటి కోసమైనా ‘UI’ సినిమాని కచ్చితంగా ఒకసారి చూడొచ్చు అని వారు అంటున్నారు. మరి డిసెంబర్ 20న మార్నింగ్ షోలు ముగిశాక.. ‘UI’ టాక్ ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
2 hours ago