బుచ్చిబాబు సానాకి ‘మైత్రి’ వారి సర్ప్రైజ్..!

‘ఉప్పెన‌’ చిత్రం ఫిబ్రవరిలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు కృతిశెట్టి కూడా హీరోయిన్‌గా పరిచయమైంది. రొటీన్ కథే అయినప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు సానా ట్రీట్మెంట్ యూత్ ను చాలా బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ చిత్రం రూ.85కోట్ల గ్రాస్ కలెక్షన్లను అలాగే రూ.50కోట్ల పైగా షేర్ ను నమోదుచేసింది.’ మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు.

ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 30కోట్ల పైనే లాభాలను బయ్యర్లకు అందించింది. అందుకే బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి ఇప్పుడు నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇదిలా ఉండగా… నిర్మాతలైన మైత్రీ వారు హీరో, హీరోయిన్లను మరియు దర్శకుడిని ఊహించ‌ని విధంగా గిఫ్ట్ లు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇటీవ‌ల 1 కోటి 25 లక్షలకు చొప్పున హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్‌ కృతి శెట్టిలకు అందజేశారు. ఇక తాజాగా దర్శకుడు బుచ్చి బాబు సానాకు బెంజ్ జిఎల్సి కారును బహుమతిగా ఇచ్చారు.

ఇదే బ్యానర్లో బుచ్చి బాబు మరో సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు.`ఉప్పెన‌` చిత్రానికి అతను ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకోలేదట. అందుకే నిర్మాతలు ఇతని పనితనానికి ఇంప్రెస్ అయిపోయినట్టు స్పష్టమవుతుంది. ఇక బుచ్చిబాబు తన తరువాతి సినిమాని ఎన్టీఆర్ తో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు కూడా మొదలైనట్టు టాక్.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus