వైరల్‌ అవ్వడానికి యంగ్‌ బ్యూటీ కొత్త ప్లాన్‌!

గ్లామర్‌ డ్రెస్‌తో ఆ హీరోయిన్‌ లుక్‌ అదిరిపోయింది, ఎయిర్‌ పోర్ట్‌ లుక్‌లో ఆ నాయిక భేష్‌, ఆ భామ ఎయిర్‌పోర్ట్‌ ఫ్యాషన్‌ సూపరో సూపరు అనే మాటలు వింటూనే ఉంటారు. ఎయిర్‌పోర్టుల్లో వారి ఫొటోలు చూసే ఉంటారు. ఏదైనా ఊరు వెళ్లడానికి, విదేశాలకు వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌ వెళ్తుంటారు. అయితే కేవలం ఫొటోల కోసం మాత్రమే ఎయిర్‌ పోర్ట్‌కి వెళ్లేవారిని ఎక్కడైనా చూశారా? ఏంటి, అలాంటి వాళ్లు కూడా ఉంటారా? అని అనుకుంటున్నారా?

మేం చెప్పింది నిజమే, అలాంటోళ్లు ఉన్నారు. ఎక్కడో విదేశాల్లో కాదు మన దేశంలోనే ముంబయిలోనే ఉన్నారు. ఆమె ఎవరో కాదు ఉర్ఫీ జావెద్‌. బాలీవుడ్‌లో ఫ్యాషన్‌ పేరు మీద అత్యంత చెత్త ట్రెండ్‌ను ఫాలో అయ్యే మోడల్ ఎవరన్నా అంటే… ఉర్ఫీ జావెద్ అనే చెబుతుంటారు బాలీవుడ్‌ జనాలు. బుల్లితెర నటి కంటే చిత్ర విచిత్ర దుస్తులతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపుతోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 20 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.

ఎక్స్‌పోజింగ్ చేయడంలో ఉర్ఫీ జావెద్‌ ఓ లెవల్‌లో ఉంటుంది. చిరుగుల దుస్తులు, గాజు పెంకుల దుస్తులు, గోనె పట్టాలు, కిటీల దుస్తులు, తలుపు దుస్తులు అంటూ రకరకాలు వేసుకుంటూ ఫొటోలకు పోజులిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను 2021లో హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటకు వచ్చాక ఆమె ఫ్యాషన్‌, ఫొటోల పిచ్చి ఎక్కువైంది. అయితే, ఉర్ఫీ జావెద్‌ ఫొటోలు చూస్తే ఎక్కువగా ఎయిర్‌ పోర్ట్‌ దగ్గరే ఉంటాయి.

ఇదొక లెక్క అయితే. ఆమె రోజూ పని ఉన్నా, లేకపోయినా మోడ్రన్ దుస్తులు ధరించి విమానాశ్రయానికి వెళ్తోంది. ఆమె ఆమె వచ్చేది విమానం ఎక్కడానికి కాదు. అక్కడ సెలబ్రిటీల కోసం వేచి ఉండే ఫొటోగ్రాఫర్లను ఆకట్టుకోడానికట. ఇంట్లో ఫొటో సెషన్ లాంటివి చేయాలంటే ఖర్చవుతుంది. అదే ఎయిర్‌‌పోర్ట్‌కు వెళ్తే ఆ ఖర్చే ఉండదు అని ఆమె ఆలోచన అని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. దీనిపై ‘‘నేను ఎక్కడికెళ్తే మీకేంటీ?’’ అంటూ ఓ సినిమాలోని డైలాగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో మీరూ చూసేయండి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus