Urvashi Rautela: ‘దబిడి దిబిడి’పై స్పందించిన ఊర్వశి రౌటేలా.. స్టెప్పులపై వైరల్‌ కామెంట్స్‌!

‘డాకు మహారాజ్‌’ సినిమాలోని ‘దబిడి దిబిడి..’ వీడియో సాంగ్‌ రిలీజ్‌ అయినప్పటి నుండి జరుగుతున్న చర్చ ‘ఆ స్టెప్పులేంటి?’ అనే. కాస్త వల్గర్‌గా కనిపించే ఆ స్టెప్పులను ఊర్వశి రౌటేలా, బాలకృష్ణ మీద కంపోజ్‌ చేశారు శేఖర్‌ మాస్టర్‌. ఆ స్టెప్పులకు దర్శకుడు బాబీ సెట్స్‌లోనే బాగా ఎంజాయ్‌ చేశారు. అయితే ఆ విమర్శలు చేస్తూనే, పాటను చూస్తూనే హిట్‌ చేసేశారు. ఈ క్రమంలో ఆ స్టెప్పుల గురించి ఊర్వశి రౌటేలా స్పందించింది.

Urvashi Rautela

సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్‌’ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. బాలకృష్ణ స్క్రీన్‌ ప్రజెన్స్‌, తమన్‌ మ్యూజిక్‌ – పాటలకు మంచి స్పందన వచ్చింది. ఊర్వశీ రౌటేలా – బాలకృష్ణ ‘దబిడి దిబిడి’ సాంగ్‌ని అయితే తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందులో కొన్ని స్టెప్పుల గురించి జరుగుతున్న చర్చ కమాల్‌ ఆర్‌ ఖాన్‌ అనే బాలీవుడ్‌ స్టార్‌ (అలా అంటుంటారు అక్కడ) నెటిజన్‌ ద్వారా ఊర్వశి వద్దకు చేరింది. ఈ విషయమై కమాల్‌ చేసిన ఓ ట్వీట్‌కు ఊర్వశీ రౌటేలా ఆయన ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.

తాజాగా ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ మరికొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒక సినిమా విజయం సాధించినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకోగలను. బాలకృష్ణ ఓ లెజెండ్‌. ఆయనతో కలిసి వర్క్‌ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. బాలకృష్ణతో డ్యాన్స్ చేయడం పర్ఫామెన్స్‌ మాత్రమే కాదు.. కళపై నా గౌరవాన్ని చూపించే వేడుక. ఆయనతో పనిచేయాలన్న నా కల అని చెప్పింది ఊర్వశి.

జీవితంలో ఏం సాధించలేని కొందరికి, కష్టపడేవారిని విమర్శించే అర్హత ఉండదు. రియల్‌ పవర్‌ అంటే ఇతరులను విమర్శించడం కాదు.. వారి గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడం అని గతంలోనే స్టెప్పుల వివాదం గురించి కమాల్‌ ఆర్‌ ఖాన్‌కు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చింది ఊర్వశి. ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు ఆగుతాయా అంటే ఏమో లేదనే చెప్పాలి. ఈ విషయాన్ని శేఖర్‌ మాస్టరే స్పందించి ముగించాలి అనిపిస్తోంది.

హీరో పై హీరోయిన్ సంజన సంచలన వ్యాఖ్యలు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus