Urvashi Rautela: ఎన్టీఆర్ నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్.. ఊర్వశి రౌతేలా కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. బాలయ్య (Balakrishna) బాబీ (Bobby) సినిమాలో సైతం ఊర్వశి రౌతేలా నటిస్తున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఊర్వశి రౌతేలా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిమ్ లో తారక్ తో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఊర్వశి జూనియర్ ఎన్టీఆర్ మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్ అని పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ క్రమశిక్షణతో నిజాయితీగా వినయపూర్వకంగా ఉండే వ్యక్తి అని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ దయ, ప్రేరణకు కోటి ధన్వవాదాలు అని ఊర్వశి కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సింహం లాంటి వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం అని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేసే ఛాన్స్ కోసం వేచి ఉండలేకపోతున్నా అని ఊర్వశి అన్నారు.

తారక్, ఊర్వశి రౌతేలా యాదృచ్ఛికంగా కలిశారా? లేక ఏదైనా ప్రాజెక్ట్ కోసం కలిశారా అనే ప్రశ్నలకు జవాబు తెలియాల్సి ఉంది. వార్2 షూటింగ్ లో జాయిన్ అయిన తారక్ త్వరలో దేవర షూట్ లో పాల్గొననున్నారు. తారక్, జాన్వీ (Janhvi Kapoor) కాంబినేషన్ లో సాంగ్స్ షూట్ చేయాల్సి ఉందని సమాచారం. మరోవైపు వార్2 సినిమాలో త్రిప్తీ దిమ్రీ (Tripti Dimri) నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

తారక్ అంటే ఎంతో అభిమానమని తారక్ తో నటించి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని ఈ బ్యూటీ పలు సందర్భాల్లో వెల్లడించగా తక్కువ సమయంలోనే ఆమె కోరిక నెరవేరిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుస ప్రాజెక్ట్ లతో తారక్ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus