Urvashi Rautela: క్రికెట్ చూడటానికి వెళ్లి గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న నటి.. సాయం చేయమంటూ పోస్ట్?

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో శ‌నివారం చిరకాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పై మరోసారి భారత్ తమ విశ్వరూపం చూపిస్తూ పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిస్తూ విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ తలపడటంతో ఈ మ్యాచ్ చూడటం కోసం ఎంతోమంది స్టేడియంకి వెళ్ళారు. అయితే సాధారణ అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూడటానికి స్టేడియం చేరుకున్నారు.

ఈ క్రమంలోనే నటి ఊర్వశి రౌటేల సైతం ఇండియాకు సపోర్ట్ చేస్తూ బ్లూ కలర్ డ్రెస్ ధరించి ఈమె ఈ స్టేడియంలో సందడి చేశారు. ఇలా మ్యాచ్ చూస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఈమె అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఇండియా గెలవడంతో ఆమె కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇండియా గెలిచిందని సంతోషపడేలోపు ఈమె తన ఐఫోన్ పోగొట్టుకొని ఎంతో ఆవేదన కూడా వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడటం కోసం ఈమె స్టేడియంకి చేరుకున్నారు. అయితే అక్కడ తన గోల్డ్ ఐఫోన్ పోయిందని ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఐఫోన్ 24 క్యారెట్ గోల్డ్ తో తయారు చేసినదని మ్యాచ్ చూస్తున్నటువంటి సమయంలో తన ఫోన్ పోయిందని ఎవరైనా చూసి ఉంటే నాకు ఇవ్వాలి అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

గోల్డ్ ఐఫోన్ పోవడంతో ఊర్వసి (Urvashi Rautela) పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి కాపీతో పాటు ఈమె అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నా 24 క్యారెట్ల నిజమైన బంగారు ఐ ఫోన్ పోయింది. ఫోన్ ను క‌నుగొన‌డంలో నాకు సాయం సహాయం చేయండి ఎవరికైనా తన ఫోన్ దొరికినా లేక కనిపించిన నాకు ఇవ్వండి నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus