పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) అనే మాస్ సినిమా రూపొందింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
‘గబ్బర్ సింగ్’ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అంచనాలు ఏర్పడ్డాయి.శ్రీలీల, రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్లుగా నటించారు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘దేక్ లెంగే సాలా’ ‘ఎత్తరా ఎత్తరా’ వంటి సాంగ్స్ కి మంచి అప్రీషియేషన్ లభించింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. అందువల్ల మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తీసుకుంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’.కానీ రెండో రోజు నుండి డౌన్ అయ్యింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 11.90 cr |
| సీడెడ్ | 5.50 cr |
| ఉత్తరాంధ్ర | 5.52 cr |
| ఈస్ట్ | 4.32 cr |
| వెస్ట్ | 2.97 cr |
| గుంటూరు | 3.55 cr |
| కృష్ణా | 3.13 cr |
| నెల్లూరు | 1.29 cr |
| ఏపీ+తెలంగాణ టోటల్ | 38.18 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.82 cr |
| ఓవర్సీస్ | 3.65 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 44.65(షేర్) |
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి రూ.122.4 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.123 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమాకి రూ.44.65 కోట్ల షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా రూ.75 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.78.35 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.