మారుతున్న ప్రేక్షకుల ధోరణితోపాటు ఫిలిమ్ మేకింగ్ లోనూ చాలా మార్పులొచ్చాయి. మునుపటిలా ప్రేక్షకులు కేవలం మూడు ఫైట్లు, ఆరు పాటలున్న సినిమాలను అంగీకరించడంలేదు. కామెడీతోపాటు ఎమోషన్స్ ను కూడా కోరుకొంటున్నారు. అందుకే కమర్షియల్ సినిమాలతోపాటు న్యూ ఏజ్ సినిమా మేకింగ్ కూడా పెరిగింది. అయితే.. న్యూ ఏజ్ సినిమా అంటే ప్రేక్షకులకు అర్ధం కాని సినిమాలు తీయడం కాదు.. కొత్త తరహా సినిమాలే వారికి అర్ధమయ్యేలా తీయాలి. అంతే కానీ.. అర్ధం కానీ సినిమాలను న్యూ ఏజ్ సినిమా పేరిట ప్రేక్షకుల మీదకు రుద్దకూడదు అని పేర్కొనడం గమనార్హం.
ఇకపోతే.. “యు టర్న్” చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి సమంత ముఖ్య కారణమని పేర్కొంటున్నాడు పవన్ కుమార్. కన్నడ వెర్షన్ రిలీజ్ కి ముందే స్క్రిప్ట్ తెప్పించుకొందట. ఆమె సహకారంతోనే కన్నడ వెర్షన్ కంటే బెటర్ గా తాను ఈ రీమేక్ ను తీయగలిగానని పవన్ పేర్కొనడం విశేషం. గత శుక్రవారం విడుదలైన “యు టర్న్” చిత్రం విశేషమైన పాజిటివ్ రివ్యూస్ & థియేటర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ హారర్ థ్రిల్లర్ ను ప్రేక్షకులందరూ ఆస్వాదిస్తుండడంతో.. సమంత ఈ తరహాలో మరిన్ని ఎక్స్ పెరిమెంట్స్ చేసేందుకు ముందుకొస్తుందని భావిస్తున్నారు.