Uv Creations: ఆదిపురుష్ తో యువి సంస్థకు ఏకంగా ఆ రేంజ్ లో లాభం వచ్చిందా?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కావడానికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ప్రభాస్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను యువి సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే మరో సంస్థ యువి సంస్థ నుంచి 170 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం.

యువి సంస్థ (Uv Creations) కొనుగోలు చేసిన మొత్తంతో పోల్చి చూస్తే 45 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఆ సంస్థ ఈ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఆ సంస్థ ఈ మూవీ హక్కులను మళ్లీ ఏరియాల వారీగా విక్రయించనుంది. ఆదిపురుష్ మూవీకి అదృష్టం కలిసొస్తుందని రిలీజ్ కు ముందు ఈ సినిమా పరిస్థితి మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆదిపురుష్ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని త్వరలో ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆదిపురుష్ మూవీ విషయంలో వ్యక్తమైన నెగిటివ్ కామెంట్లకు ఓం రౌత్ చెక్ పెట్టారు. ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన తెలుగు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

సినీ అభిమానులు సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ మూవీ రేంజ్ రిలీజ్ సమయానికి మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో ప్రభాస్ కోరుకున్న భారీ ఇండస్ట్రీ హిట్ అయితే దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కృతిసనన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటించగా సైఫ్ అలీ ఖాన్ రావణుని పాత్రలో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus