Nayanthara: తెలుగులోకి నయనతార ‘కనెక్ట్’ సినిమా!

  • December 5, 2022 / 07:09 PM IST

సౌత్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతోంది. పెళ్లి తరువాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది నయనతార. కథ నచ్చితేనే సినిమాలు చేస్తోంది. సొంత బ్యానర్ లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. ఇప్పుడు తన బ్యానర్ లో తెరకెక్కిన ‘కనెక్ట్’ అనే సినిమాలో నటించింది నయనతార.

ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ రిలీజ్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సెన్సార్ సర్టిఫికేట్ పొందింది. హారర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.

ఈ సినిమా రన్ టైం 99 నిమిషాలు. ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఈ సినిమాను థియేటర్లలో ప్రసారం చేయనున్నారు. నయనతార దర్శకుడు అశ్విన్ తో ఇదివరకు ‘మాయ’ అనే సినిమా చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి ‘కనెక్ట్’ సినిమాతో ఈ కాంబో కలిసింది. ఈ సినిమాలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ ప్రయోగాత్మక సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus