టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. దాదాపుగా 9ఏళ్ల సుధీర్గ విరామం తరువాత సైతం చిరు ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు…ఇక ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో చిరుని రిసీవ్ చేసుకుని చిరు 150మూవీతో పండగ చేసుకున్నారు…అయితే పక్కా కమర్షియల్ సినిమాగా ఈ సినిమా ఉంది అన్న విమర్శలు రావడంతో చిరు తన నెక్స్ట్ సినిమాని ఎలా అయినా మంచి మెసేజ్ ఇచ్చే సినిమాగా తియ్యలి అని ఫిక్స్ అయ్యి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి పాత్రను ఎంచుకుని సెన్సేషన్ సృష్టించాడు. ఇక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్ళేందుకు అంతా సిద్దం సైతం చేసుకున్నాడు చిరు అండ్ బ్యాచ్. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా తనయుడు రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ స్థాయి చిత్రంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిరు మరియు చెర్రీ. అయితే ఇక్కడే ఈ సినిమా విషయంలో చిన్న చేంజ్ ఉంది అన్న టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది…ఏంటి ఆ చేంజ్ అంటే…18వ శతాబ్దానికి సంబంధించిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తన జన్మదినం ఆగస్టు 22న కాకుండా ఆగస్టు 15న ప్రారంభించాలని చిరంజీవి భావిస్తున్నారట.
ఓ పోరాట యోధుడి జీవితంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పంద్రాగస్టు రోజున అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి కోసం కొణిదెల ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. మెగా క్యాంపులో రేసుగుర్రం ధ్రువ లాంటి హిట్లను అందించిన ఘనత కలిగిన సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. లాంచ్ తర్వాత రెగ్యులర్‌గా షూటింగ్ నిర్వహించి వచ్చే వేసవికి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్లానింగ్ పెట్టుకున్నారు. మొత్తంగా సెంటిమెంట్ ను పక్కన పెట్టి దేశభక్తికే చిరు వోట్ వేస్తున్నాడు…మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.