హీరోయిన్ అదితీ రావు లుక్ ను పోస్ట్ చేసి ‘వి’ కథ పై క్లారిటీ ఇచ్చేసిన నాని..!

మరికొద్ది గంటల్లోనే నాని-సుధీర్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లు సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసాయి. ‘మిస్టరీ థ్రిల్లర్ గా ‘వి’ ఉంటుంది’ అని దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చెబితే.. ‘ఈ చిత్రంలో ట్విస్టులని ప్రత్యేకంగా ఏమీ ఉండవు, నెరేషన్ మొత్తం స్ట్రైట్ గానే ఉంటుంది కానీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది’ అంటూ నాని చెప్పుకొచ్చాడు.

దీంతో అందరికీ ‘వి’ కథ పై కొత్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ తాజాగా ఒక్క పిక్ తో ‘వి’ సినిమా స్టోరీ ఇదే అన్నట్టు హింట్ ఇచ్చేసాడు నాని. ఇప్పటి వరకూ ఈ చిత్రం ప్రమోషన్లలో అదితీ రావు హైదరి పాత్రకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్ర యూనిట్ సభ్యులు.మరో హీరోయిన్ నివేదా థామస్ ను అయితే టీజర్, ట్రైలర్లలో చూపించారు. అయితే కొద్దిసేపటి క్రితం అదితి రావు హైదరి పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేసి స్టోరీ పై హింట్ ఇచ్చేసాడు నాని.దాంతో ఈ చిత్రం కథ ఇదేనంటూ కొందరు కథనాలు పుట్టిస్తున్నారు.

వాటి ప్రకారం..’ ‘వి’ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో నాని కూడా పోలీస్ ఆఫీసరేనని.. అతని భార్యగా అదితీ రావు హైదరి కనిపించబోతుందని.. కొందరు ఆఫీసర్లు నానిని ఓ స్కామ్ లో ఇరికించి..అన్యాయంగా అతని భార్యని(అదితీ రావు హైదరిని) చంపేస్తారని, అందుకే నాని సీరియల్ కిల్లర్ గా సైకోగా మారి.. వాళ్ళను చంపుతూ పోతాడని కథనాలు వినిపిస్తున్నాయి’. మరి వీటిలో ఎంత వరకూ నిజముందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus