Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్ గేమ్ స్టార్ట్ చేసిన చిన్మయి!
- March 15, 2026 / 12:10 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ సినిమా గీత రచయిత వైరముత్తుకు సాహితీ పురస్కారాల్లో అత్యున్నతమైన జ్ఞానపీఠ్ పురస్కారం దక్కింది. 2025వ ఏడాదికిగాను ఆయన పేరును పురస్కార ఎంపిక కమిటీ ప్రకటించింది. తమిళుల్లో ఇప్పటికే ఇద్దరికి ఈ పురస్కారం దక్కగా.. మూడో వ్యక్తి వైరముత్తు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయనకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్.. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఆయనపై ఎన్నో ఏళ్లుగా విమర్శలు చేస్తున్న ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన మాటల యుద్ధాన్ని స్టార్ట్ చేశారు.
Vairamuthu
తొలుత వైరముత్తు గురించి చూస్తే.. తమిళనాడులోని తేని జిల్లాలో మేట్టూర్‌లో 1953లో జన్మించారు వైరముత్తు. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే రాసిన ‘వైకరై మేఘంగళ్’ అనే కవితా సంకలనం అప్పట్లోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఓ మహిళా కళాశాలలో పాఠ్యాంశంగా కూడా మారింది. తమిళనాడు అధికారిక భాషా కమిషన్‌లో పని చేస్తున్నప్పుడే (1980లో) ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ‘నిళల్గళ్’ సినిమా ద్వారా సినిమా గీత రచయితగా తమిళ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు.

కవితలు, నవలలు రాస్తూ తదితర సుమారు 40 పుస్తకాలు, 7,500కిపైగా పాటలు రాశారు. ఇప్పటికే వైరముత్తుకు సాహిత్య అకాడమీ, సాధన సమ్మాన్, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాలు వచ్చాయి. ఇక ఉత్తమ గేయ రచయితగా ఏడు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆరు సార్లు పురస్కారాలు అందుకున్నారు.
ఇక చిన్మయి విషయానికొస్తే.. వైరముత్తును కొనియాడుతూ కమల్ హాసన్ ఒక పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా వైరముత్తును ‘అంకుల్ మెంటార్’ అని సంబోధించారు కమల్. దీనికి చిన్మయి ఆయననూ తప్పుబడుతూ రిప్లై ఇచ్చింది. సదరు అంకుల్ – మెంటార్ మహిళలకు చేసిన అన్యాయాల గురించి ఎంతగా మొర పెట్టుకున్నా సినిమా రంగంలో ప్రముఖులు వినిపించుకోవడం లేదు అని కామెంట్ చేశారు. పురుషులు ఎప్పుడూ మహిళల వైపు ఉండరని.. వాళ్లందరూ వాళ్ల అన్నదమ్ములు, మామలు, తండ్రులు, స్నేహితులు, మెంటార్ల వైపే నిలుస్తారని కామెంట్ చేశారు. దీంతో వైరముత్తుకు పురస్కారం దక్కినా.. మనశ్శాంతి దక్కడం లేదు.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్..













