Vaishnav Tej: చిరంజీవి కోసం అలాంటి పని చేసిన వైష్ణవ్!

మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈయన సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వైష్ణవ్ అనంతరం కొండపొలం రంగ రంగ వైభవంగా వంటి సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయని చెప్పాలి. ఇక తాజాగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ లీల వైష్ణవ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఆదికేశవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు

ఈ సినిమా నవంబర్ 24వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైష్ణవ తేజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చిరంజీవి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ అన్న వేసుకుని డ్రెస్సింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టమని ఈయన తెలియజేశారు. ఆయన ఎంతో హుందాగా డ్రెస్ వేసుకుంటారని వైష్ణవ్ తెలియజేశారు.

ఇక ఒక గుండు ఫోటోని చూపిస్తూ ఇలాంటి లుక్ లో ఒక సినిమాలో విలన్ పాత్రలో నటిస్తారా అంటూ ప్రశ్నించగా తప్పకుండా నటిస్తాను అంటూ సమాధానం చెప్పారు. ఇక వైష్ణవ్ గతంలో ఒకసారి తన తలపై చిరు అని రాయించుకున్నటువంటి ఫోటోని చూపించడంతో ఆ ఫోటో వెనుక ఉన్న స్టోరీని తెలియజేశారు. చిరంజీవి మామయ్య పుట్టినరోజు కావడంతో ప్రతి ఒక్కరూ కూడా తనకు గిఫ్ట్లు ఇస్తున్నారు.

ఇక ఆరోజు అన్నయ్య ధరమ్ తేజ్ కూడా ఒక కత్తిని కొనుగోలు చేసి మామయ్యకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక నేను ఏమి ఇవ్వగలను నా ప్రాణం తప్ప అని ఆలోచిస్తున్న సమయంలో నాకు ఈ ఐడియా వచ్చి చిరు అని నా తలపై హెయిర్ కట్ చేయించుకున్నానని తెలిపారు. ఇలా చిరంజీవి కోసం తాను ఏమైనా చేస్తానని ఈ సందర్భంగా (Vaishnav Tej) వైష్ణవ్ తన మామయ్య పై ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus