Vaishnav Tej: మెగా ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చిన వైష్ణవ్ తేజ్..?

Advertisement

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. కలెక్షన్లపరంగా ఉప్పెన సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కావడం, సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఉప్పెనతో అంతకు ముందు హీరోలు తొలి సినిమాలతో క్రియేట్ చేసిన రికార్డులను సులభంగా వైష్ణవ్ తేజ్ సులభంగా చెరిపేశారు. అయితే వైష్ణవ్ తేజ్ ఫేవరెట్ హీరో మాత్రం మెగాహీరో కాకపోవడం గమనార్హం.

ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు వైష్ణవ్ తేజ్ కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ అని చెప్పారు. సాధారణంగా యంగ్ జనరేషన్ మెగా హీరోలలో ఎక్కువమంది చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ తమ ఫేవరెట్ హీరో అని చెబితే వైష్ణవ్ తేజ్ మాత్రం రజినీకాంత్ పేరు చెప్పి మెగా ఫ్యాన్స్ కు షాకిచ్చారు. సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్ చేసిన వైష్ణవ్ తేజ్ తనకు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను అభిమానుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పేశారు.

ఒక అభిమాని రజినీకాంత్ నటించిన సినిమాలలో ఇష్టమైన సినిమా ఏమిటని ప్రశ్నించగా శివాజీ సినిమా తనకు ఇష్టమని వైష్ణవ్ పేర్కొన్నారు. ఉప్పెన సినిమా సక్సెస్ వల్ల పలువురు టాలీవుడ్ దర్శకులు వైష్ణవ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమాలో నటించగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. వైష్ణవ్ తేజ్ భవిష్యత్తు సినిమాలు కూడా హిట్టైతే వైష్ణవ్ తేజ్ స్టార్ హీరో కావడానికి ఎంతో సమయం పట్టదని చెప్పాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus