Vajpayee OTT: ఓటీటీలో వాజ్‌పాయ్‌ బయోపిక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడ, ఎక్కడంటే?

ప్రధానమంత్రుల నందు… సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధానులు వేరయా! అంటుంటారు రాజకీయాల్లో. అంటే వచ్చి… పాలించి వెళ్లిపోయే వాళ్లు కాకుండా దేశం గతిని తమ ఆలోచనలు, సంస్కరణలతో మార్చేవాళ్లు కొందరుంటారు. అలాంటి వారిలో మన తరం చూసిన ప్రధానుల్లో అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ ఒకరు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఎంతో ఇష్టంగా మార్చిన పీఎం ఆయన. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మై అటల్‌ హు’. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రంగం సిద్ధమైంది.

భారత మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మై అటల్‌ హూ’. బాలీవుడ్‌ సీనియర్‌, విలక్షణ నటుడు పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi) ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి. రవి జాదవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 19న థియేటర్లలోకి వచ్చింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీ5లో మార్చి 14 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. దీంతో అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ (Vajpayee) జీవితాన్ని చూద్దామని నేటితరం ఔత్సాహికులు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. అజాత శత్రువు, రాజనీతిజ్ఞుడు అటూ అటల్ బిహారీ వాజ్‌పాయ్‌ని రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు గౌరవిస్తుంటారు. ఆయన పాలన, రాజకీయ జీవితాన్ని మిళితం చేసి ఈ సినిమాను తీర్చిదిద్దారు రవి జాదవ్‌. వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబం, స్నేహితులతో ఆయనక అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించారు.

కార్గిల్ యుద్ధం, పోక్రాన్ అణు పరీక్షలు సహా అనేక అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించారు. థియేటర్లలో ఆయా సన్నివేశాలకు మంచి స్పందన వచ్చింది అంటారు. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రూ. 6.5 కోట్లే వసూలు చేసింది. దీంతో ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో అని వెయిట్‌ చేస్తున్నారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus