Anjali : ‘వకీల్ సాబ్’ టీమ్ కు కోవిడ్ టెన్షన్!

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకి విజృభిస్తుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, విజయేంద్రప్రసాద్, నివేదా థామస్ లాంటి సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో హీరోయిన్ అంజలి కూడా చేసింది. కొద్దిరోజులుగా ‘వకీల్ సాబ్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటుంది అంజలి. టీవీ, యూట్యూబ్, వెబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ గ్యాప్ లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తుంది.

దర్శకుడు వేణుశ్రీరామ్, నివేదా థామస్, అంజలి, అనన్యలతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఆ తరువాత రెండు రోజులకే అంజలి కూడా అస్వస్థతకు గురైంది. వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం అంజలి తన ఇంట్లోనే క్వారెంటైన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే తనకు కరోనా సోకినట్లు అంజలి అధికారికంగా చెప్పకపోవడంతో అభిమానులు ఆందోళకు గురవుతున్నారు.

ఇటీవలే ‘వకీల్ సాబ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పసుపు రంగు చీర కట్టుకొని అందరి దృష్టిని ఆకర్షించింది అంజలి. ఇప్పుడు ఈమెకి కరోనా రావడంతో ‘వకీల్ సాబ్’ టీమ్ లో టెన్షన్ మొదలైంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మరికొందరు కూడా కరోనా బారిన పడినట్లు సమాచారం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus