3 ఏళ్ళ తరువాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ సినిమా వస్తే అది కాస్త ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వివరాల్లోకి వెళితే..పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఈ మధ్యనే విడుదలై 2 వారాలు కావస్తోంది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి నిర్మించారు. సినిమాకి హిట్ టాకే వచ్చింది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అలాగే ఏపీలో ఈ చిత్రం టికెట్ రేట్లు తగ్గించెయ్యడం వంటివి సినిమా కలెక్షన్ల పై దెబ్బ కొట్టింది.
‘వకీల్ సాబ్’ 13 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 24.10 cr |
సీడెడ్ | 12.71 cr |
ఉత్తరాంధ్ర | 11.59 cr |
ఈస్ట్ | 6.14 cr |
వెస్ట్ | 7.13 cr |
గుంటూరు | 7.07 cr |
కృష్ణా | 4.88 cr |
నెల్లూరు | 3.33 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 76.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.58 cr |
ఓవర్సీస్ | 3.83 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 84.36 cr |
‘వకీల్ సాబ్’ చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 84.36 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 6.14 కోట్ల షేర్ ను రాబట్టాలి. నిన్నటి నుండీ తెలంగాణాలో చాలా వరకూ థియేటర్లు మూత పడ్డాయి. వీకెండ్ వరకూ వకీల్ సాబ్ ప్రదర్శించబడుతున్న థియేటర్లు రన్ అవుతాయట. ఇక ఏపిలో 50శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు రన్ అవుతున్నాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలుంది. చూస్తుంటే అది కష్టమే అనిపిస్తుంది.
Click Here To Read Movie Review
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!