‘ఎన్టీఆర్’కాకపోతే బన్నీ అట!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎన్టీఆర్…బన్నీ పేర్లు ముందుగా ముందు వరుసలో ప్రస్తావిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అలాంటి హీరోలతో సినిమాలు చెయ్యాలి అంటే ఎంతో మంది దర్శకులు క్యూ కడుతూ ఉంటారు. అయితే అదే క్రమంలో అనుభవం ఉన్న దర్శకులతో సినిమాలు తీస్తూ ఉంటారు మన టాప్ హీరోలు. ఇక కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చే విషయానికి వస్తే హీరోలందరూ కాస్త సేఫ్ జోన్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ముందుగా కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చే అవకాశాన్ని ఎన్టీఆర్ తీసుకున్నాడు… ప్రముఖ కధా రచయిత వక్కంత వంశీ టాప్ హీరోల సినిమాలకి ఎన్నో మంచి కధలను అందించాడు. అదే క్రమంలో తాజాగా ఎన్టీఆర్ ను కలసి ఒక కధ చెప్పడంతో ఎన్టీఆర్ కు ఆ కధ బాగా నచ్చి తనతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు ఎన్టీఆర్….ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ, తాజాగా ఎన్టీఆర్ ఇప్పట్లో ఆ సినిమా గురించి చెప్పలేనని, వంశీతో సినిమా విషయంలో కాస్త టైమ్ పడుతుంది అని తెలిపినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ను మాత్రమే నమ్ముకుంటే కష్టం అని ముందే భావించిన వంశీ, తన సేఫ్టీ తాను ప్లాన్ చేసుకున్నాడు. గతంలో మనోడు ”ఎవడు” సినిమాకు కథ ఇచ్చినప్పటి నుండే అటు రామ్ చరణ్ ఇటు అల్లు అర్జున్ లతో కాస్త క్లోజ్ గా మూవ్ అవుతున్న వంశీ…అదే చనువుతో బన్నీకి ఒక కధ చెప్పినట్లు బన్నీ సైతం సినిమా చేద్దాం అని అన్నట్లు సినిమా సర్కిల్స్ లో వినిపిస్తున్న వాదన. అయితే ప్రస్తుతం దువ్వాడ జగన్నాథమ్ సినిమాను చేస్తున్న బన్నీ…వచ్చే ఏప్రియల్ వరకు ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటాడు. అప్పటివరకూ బన్నీ వేరే సినిమా చేసే చాన్స్ లేదు. మరి ఈలోపు ఎన్టీఆర్ మనసు మార్చుకుని వంశీకి అవకాశం ఇస్తాడో, లేక బన్నీ మాట కోసం వంశీ ఎదురు చూస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus